Site icon MANATELANGANAA

కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్‌లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం

వరంగల్, సెప్టెంబర్ 17: ప్రభుత్వ మార్గదర్శకాల్లో భాగంగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్, కేఐటీఎస్‌ఎన్‌ఎస్ యూనిట్ సహకారంతో “డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం అట్లాగే ప్రతిజ్ఞ” ను కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (కిట్స్ వరంగల్)లోని సిల్వర్ జూబిలీ సెమినార్ హాల్లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా వచ్చిన కే.యూ. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, సామాజిక కార్యకర్త డా. కె. అనితా రెడ్డి మాట్లాడుతూ, కిట్స్ వరంగల్ ఇతర కాలేజీలకు ఆదర్శంగా నిలిచే డ్రగ్-ఫ్రీ క్యాంపస్ అని అన్నారు.

విద్యార్థులు తల్లిదండ్రులతో సమస్యలు పంచుకోవాలని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. “నేను ఇక్కడ ముఖ్య అతిథిగా కాకుండా, ఒక తల్లిగా మాట్లాడుతున్నాను. డ్రగ్స్ మానవ జీవితాన్ని నాశనం చేస్తాయి” అని ఆమె పేర్కొన్నారు.

కె.యూ. పోలీస్ స్టేషన్‌ ఎస్.హెచ్.ఓ. ఎస్. రవికుమార్ మాట్లాడుతూ, విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వం, ప్రవర్తన సమాజానికి ఎంతో అవసరం అని అన్నారు. సమాజాన్ని డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచే బాధ్యత యువతపై ఉందని తెలిపారు. “యూత్ డ్రగ్స్ వాడొద్దు, ఇతరులను కూడా వాడనీయొద్దు” అని నినాదం ఇచ్చారు.

కేర్ & క్యూర్ సంస్థ స్థాపక సభ్యుడు డా. ఆచార్య రవికుమార్ వెలదండి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో జరుగుతున్న డ్రగ్ వ్యతిరేక ఉద్యమంలో యువత ప్రధాన భాగస్వాములని అన్నారు.

కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోకరెడ్డి అధ్యక్ష ప్రసంగంలో డ్రగ్స్ సృజనాత్మకతను, సానుకూల ఆలోచనను నాశనం చేస్తాయని హెచ్చరించారు. విద్యార్థులు టెక్నాలజీ నైపుణ్యాలు పెంపొందించి, సుస్థిర అభివృద్ధి ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో కె. యు పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ S. రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, కిట్స్‌డబ్ల్యు యాంటీ-డ్రగ్ కమిటీ, కన్వీనర్, ప్రొఫెసర్ కె. శ్రీధర్, ఇతర సభ్యులు డాక్టర్ పి. నాగార్జున రెడ్డి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్  సిహెచ్. సతీష్ చంద్ర, అసోసియేట్ ప్రొఫెసర్ & పిఆర్‌ఓ, డా. డి.ప్రభాకరా చారి,  260 మందివిద్యార్థులు మరియు  ఎన్ ఎస్ ఎస్ విద్యార్థి ప్రతినిధులు సెషన్లలో  హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share this post
Exit mobile version