Site icon MANATELANGANAA

సమ న్యాయానికి న్యాయవాదులు ముందుండాలి

ఐ ఎల్ పి ఎ 5వ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి

ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వరరావు

  80 ఏండ్ల స్వాతంత్ర భారతదేశంలో నూటికి 85 శాతం ప్రజలు సకల అసమానతలతో కూటి కోసం కోట్లాడే దుస్థితిలో ఉన్నారని అలాంటి సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడంలో న్యాయవాదులు ముందుండాలని ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తొండపు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల 20 న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగు ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 5వ రాష్ట్ర సదస్సు గోడ పత్రికలను విడుదల చేసి ఆయన మాట్లాడారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయమైన అభివృద్ధి జరిగి భారత సమాజం అభివృద్ధి చెందినప్పటికీ ఆ అభివృద్ధి ఫలాలు కొంత మంది చేతిలో బందీ అయి మెజార్టీ సమాజం అణచివేయబడి నానాటికి అసమానతలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అత్యున్నత విద్యతో పాటు రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన ఉన్నత విద్యావంతులైన న్యాయవాదుల పోరాటం ద్వారానే సమసమాజం ఏర్పడుతుందని ఆయన అన్నారు. 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్ జె శాంసన్ మాట్లాడుతూ పూలే, అంబేద్కర్ సిద్ధాంత పునాదితో న్యాయవాదుల వృత్తిపరమైన అభివృద్ధితో పాటు సామాజిక చైతన్యం, సామాజిక న్యాయం కోసం ఐ ఎల్ పి ఎ చేస్తున్న పోరాటంలో న్యాయవాదులు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20 న కొత్తగూడెంలో జరుగు రాష్ట్ర సదస్సులో రాజ్యాంగ విలువలు - ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్ట్ ప్రజల హక్కులు, ఇ డబ్ల్యు ఎస్ కు లేని నిబంధన ఓబీసీ లకు ఎందుకు, మహిళా కోటాలో బహుజన కోటా, న్యాయవాద రక్షణ చట్టం అనే నాలుగు అంశాలపై జరుగు సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ హై కోర్టు జడ్జి, మాజీ జాతీయ ఓబీసీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, విశిష్ట అతిథులుగా కొత్తగూడెం జిల్లా జడ్జి పాటిల్ వసంత్, అదనపు జిల్లా జడ్జి ఎస్ సరిత, గౌరవ అతిథులుగా రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి టి చిరంజీవులు, కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షులు సుజాత కె చౌదంటే లు హారవుతారని తెలిపారు. ఇట్టి సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిని నరేందర్, న్యాయవాదులు మేకల సుగుణాకర్ రావు, కిషోర్ అంబేద్కర్, కె రాకేష్, విప్లవ కుమార్, సునంద, చరణ్, హరీష్, జి రామకృష్ణ, పి జగదీష్, వారాల నరసింహరావు, ఎం శ్రీనివాసరావు, పి రామబ్రహ్మం, పిడతల రామ్మూర్తి, జి రామకృష్ణ, డి భవాని, టి లలిత తదితరులు పాల్గొన్నారు
Share this post
Exit mobile version