Site icon MANATELANGANAA

బావ ఫోన్ టాప్ చేస్తారా- కేటీఆర్ పై  కవిత సంచలన ఆరోపణలు

mlc kavitha

బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై  ఆయన సోదరి కవిత సంచలన ఆరోపణలు చేసారు.
బి ఆర్ ఎస్ పాలనలో తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని  వ్యాఖ్యలు చేసిన కవిత
బావ ఫోన్‌ని ట్యాప్ చేస్తారా అని ప్రశ్నించారు కవిత
అవమానమే పార్టీకి దూరం కావడానికి కారణమని వెల్లడించారు
కరీంనగర్‌: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. “ఎవరైనా సొంత బావ ఫోన్‌ను ట్యాప్ చేస్తారా?” అంటూ తన సోదరుడు  కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వార్తలు వినగానే తనకు చాలా బాధ కలిగిందని కవిత అన్నారు.
‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, బీఆర్ఎస్‌లో తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. “అన్యాయం జరిగితే భరిస్తాను… కానీ అవమానాన్ని మాత్రం సహించను. ఆత్మగౌరవం కోసమే పార్టీతో విభేదించాను” అని ఆమె స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ చాలామంది అసంతృప్తిగా ఉన్నారని కవిత అన్నారు. తాను పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత పలువురు నేతలు, కార్యకర్తలు తనను సంప్రదించి టచ్‌లోకి వచ్చారని తెలిపారు. ‘జనం బాట’లో పాత బీఆర్ఎస్ కేడర్ తమతో మాట్లాడుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యత నెలకొన్నదని కవిత అభిప్రాయపడ్డారు.

Share this post
Exit mobile version