Site icon MANATELANGANAA

ఏసీబీ కేసులో తహసీల్దార్ కు జైలు శిక్ష

లంచం తీసుకున్న కేసులో కాసిపేట తహసీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష
కరీంనగర్: మంచిర్యాల జిల్లా కాసిపేట మండల తహసీల్దార్‌గా పనిచేసిన అలుగునూరి రోషయ్యను లంచం కేసులో కోర్ట్ దోషిగా తేల్చింది.

కరీంనగర్‌లోని SPE, ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం సెప్టెంబర్ 10న తీర్పు వెలువరించింది.


ప్రత్యేక న్యాయమూర్తి నామా సంతోష్ కుమార్, క్రైమ్ నంబర్ 02/ACB-KNR/2013కు సంబంధించిన C.C. No.19/2016 కేసులో రోషయ్యను అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 7, సెక్షన్ 13(2)తో పాటు 13(1)(d) కింద దోషిగా నిర్ధారించారు.
సెక్షన్ 7 కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించారు.

జరిమానా చెల్లించకపోతే అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.


అలాగే సెక్షన్ 13(2)తో పాటు 13(1)(d) కింద మరో రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు.
ACB వివరాల ప్రకారం, 2013 జనవరి 9న కాసిపేట తహసీల్దార్‌గా పనిచేస్తున్న రోషయ్య ఫిర్యాదుదారుడి నుంచి రూ.10,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. ఫిర్యాదుదారుడి పేరుపై వ్యవసాయ భూమిని భూ రికార్డుల్లో (జమాబందీ) మ్యూటేషన్ చేయడంతో పాటు పట్టాదారు పాస్‌బుక్ జారీ చేసేందుకు అధికారికంగా సహకరించేందుకు ఈ మొత్తాన్ని తీసుకున్నట్లు ACB కేసు నమోదు చేసింది.

Share this post
Exit mobile version