హన్మకొండ లోని హరిత కాకతీయ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…..
వాళ్ళు చేస్తే సంసారం… వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్న పదేళ్ళలో 36 మంది ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.
అందులో ఏ ఒక్కరూ ఎందుకు రాజీనామా చేయలేదని మాజీ సీఎం కేసీఆర్ గారిని ప్రశ్నించారు. వాళ్ళు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకుంటున్నాడని అన్నారు. అప్పుడు లేని విలువలు ఇప్పుడే వచ్చాయా అని ప్రశ్నించారు.
సభ్యత, సంస్కారం మరచి వ్యక్తిగత విమర్శలు రాజకీయాలకు మంచిది కాదు……
కొంతమంది స్థాయిని మరచి సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయాలకు మంచిది కాదని హితవు పలికారు. వాళ్ళ లాగా నాకు మాట్లాడటం వచ్చని కానీ తాను చదువుకున్న చదువు, సమాజంలో ఉన్న మర్యాద వల్ల మాట్లాడేందుకు సభ్యత అడ్డువస్తుందని అన్నారు. వాళ్ళ వ్యాఖ్యలను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్ననాని తెలిపారు. 15ఏళ్ళు ఎమ్మెల్యే గా ఉండి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా, అవినీతి అక్రమాలకు పాల్పడుతు, చిలిపి పనులు చేసి దళిత బంధు అమ్ముకుని, బి ఫాం అమ్ముకున్న వ్యక్తులు ఈ రోజు సుద్ద పూసల లాగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ విధానాలపై, అభివృద్ధి పనుల పైన మాట్లాడితే సమాధానం చెప్పవచ్చు కానీ ఇలాంటి దిగజారుడు మాటలకు ఎలాంటి సమాధానం చెప్పాలని అన్నారు. ఇలాంటి వ్యక్తుల వల్లే రాజకీయాలు బ్రష్టు పడుతున్నాయని విమర్శించారు.
నేను అడుక్కోలేదు… వాళ్లే పిలిచి పదవులు ఇచ్చారు….
నియోజకవర్గ అభివృద్దే ఎజెండగా పని చేస్తానని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజలు నన్ను గెలిపించారాని అన్నారు. గత 15ఏళ్లుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని కొంతైనా పుడ్చాలనే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాని తెలిపారు. నేను పదవిలో ఉండి భూకబ్జాలు చేయలేదని.. సెటిల్ మెంట్లు చేయలేదని.. అవినీతి చేయలేదని స్వార్థం కోసం పని చేయలేదని అన్నారు. నాకు వచ్చిన అవకాశాలను ఉపయోంగించుకొని ఉమ్మడి జిల్లా అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కృషి చేశానని తెలిపారు. నేను ఏనాడు ఎవరిని పదవులను అడుక్కో లేదని.. కేసీఆర్ గారే ఢిల్లీలో ఉన్న నన్ను పిలిచి డిప్యూటీ సీఎం చేశారన్నారు. వ్యక్తిగతంగా నేను పార్టీ ఫిరాయింపులను సమర్థించనని కానీ వ్యక్తి గత ఇష్టాయిష్టాలకన్నా నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని భావించి వెళ్లానని తెలిపారు.
ప్రజల చేత, పార్టీల చేత తిరస్కరించబడిన వ్యక్తివి నువ్వు…..
ఢిల్లీలో ఇంటిఇంటికి తిరిగి పార్టీలో చేర్చుకోమని అడిగితే తిరస్కరించిన వ్యక్తి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నీ గొప్పతనం ఏంటో తెలియదా. మేడారంలో మహిళలు పార్టీలోకి రావద్దన పూజలు చేశారని అన్నారు. ఎవరెన్ని వ్యక్తిగత దూషణలు చేసినా వాటికి వెరవకుండా ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్ననని తెలిపారు. స్పీకర్ మా అందరికీ నోటీసులు ఇచ్చారని ఈ నెల ఆఖరు వరకు స్పీకర్ కు నా వివరణ పంపిస్తానని తెలిపారు. స్పీకర్ నిర్ణయం బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని అన్నారు. పార్టీ మారిన వారిలో నేనే మొదటి వాడిని కాదు, చివరి వాడిని కాదని అన్నారు. నేను ఎవరి దగ్గర మోకరిళ్ళే వ్యక్తిని కాదని కాబట్టి కడియం శ్రీహరి ఎప్పుడూ ఐకాన్ గానే ఉంటాడని స్పష్టం చేశారు.
రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే…..
ఈ రోజు రాష్ట్రంలో కడియం శ్రీహరికి ఈ హోదా, పేరు ఉందంటే దానికి కారణం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు పెట్టిన రాజకీయ బిక్ష మాత్రమే అని అన్నారు. స్టేషన్ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 21 నెలలోనే 1025కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సాగు నీరు, విద్యా, వైద్యం తో పాటు విద్యుత్ రంగాలకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. 148 కోట్లతో దేవాదుల ఉప కాల్వల మరమ్మత్తు చేయడం ద్వారా చివరి ఆయకట్టు వరకు గోదావరి నీళ్లు వెళ్తున్నాయని అన్నారు. లింగాల ఘనపూర్ మండలంలో తొలిసారి అనేక చెరువులు నింపుకున్నామని అన్నారు. దేవాదుల 3దశ 6వ ప్యాకేజీ సవరించిన అంచనాలకు 1015 కోట్లతో చేపట్టనున్న పనుల ద్వారా నాలుగు నియోజకవర్గాలలో 78వెల ఎకరాలకు సాగు నీరు అందనుందని తెలిపారు. రానున్న ఏడాది లో నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. 200కోట్లతో యాంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు అయ్యాయని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో 45.50కోట్లతో 100 అస్పత్రి నిర్మాణం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో రైతులకు విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు అనేక సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.