జన విజ్ఞాన వేదిక 5వ జిల్లా వార్షిక సమావేశం, హనుమ కొండ
శాస్త్రీయ దృక్పథం పెంపుదలతోనే సమాజాభివృద్ధి.
— ఆచార్య మల్లికార్జున రెడ్డి.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కోఆర్డినేటర్ కాకతీయ యూనివర్సిటీ
సుబేదారి: జన విజ్ఞాన వేదిక హానుమకొండ జిల్లా కమిటీ ఐదవ వార్షిక సదస్సు సుబేదారిలోని యూనివర్సిటీ న్యాయ కళాశాలలో కాజీపేట పురుషోత్తం అధ్యక్షతన ఆదివారఓ జరిగింది.
ప్రారంభ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాకతీయ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూనిట్ కోఆర్డినేటర్ ఆచార్య మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ద్వారా మూఢనమ్మకాలు తగ్గించి సమాజాన్ని ప్రగతి పదంలో నడపవచ్చని అన్నారు. సహజ వనరుల శాస్త్రీయ వినియోగంతోనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు.
ఏ ప్రాంతంలోనైనా నీటి కొరతను అధిగమించేందుకు వర్షపునీటి సమరక్షణ ఇంకుడు గుంతల ఏర్పాటు,చెక్ డాంల నిర్మాణం అవసరమని చెరువుల మధ్య అనుసంధాన వ్యవస్థను ఏర్పరిచి భూగర్భ జలాల స్థాయిని పెంచి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడవచ్చని అన్నారు. ప్లీనరీ సెషన్ లో కీలక ఉపన్యాసం చేసిన అర్థశాస్త్ర ఆచార్యులు ఆచార్య అందె సత్యం మాట్లాడుతూ పారిశ్రామిక విప్లవం ద్వారా ప్రపంచంలోని అనేక దేశాల జిడిపి ఉత్పాదికత ఘననియగా పెరిగింది ఇది పూర్తిగా శాస్త్రీయ ఆవిష్కరణ ఫలితమని వివరించారు. వక్తులు మర్రి యాదవ రెడ్డి, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, ఆచార్య కృష్ణానంద్, ఆచార్య లక్ష్మారెడ్డిలు సందేశాలు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి బిక్షపతి గత సంవత్సర కాల కార్యకలాపాల నివేదికను, పరికిపండ్ల వేణు ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లాలోని 14 మండలాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు వివిధ మండలాల నుండి వచ్చిన ప్రతినిధులు వారి మండలాల కార్యక్రమాల నివేదికలను ప్రవేశపెట్టారు. ప్రధాన కార్యదర్శి, కోశాధికారి నివేదికలను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సులో ఈ క్రింది తీర్మానాలు చేశారు. మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని చేయాలి, యునెస్కో గుర్తించిన వారసత్వ సంపద అయినటువంటి రామప్ప దేవాలయం ముందు ముందు రోజుల్లో కూలిపోయే అవకాశముంటుంది మరియు పర్యావరణం దెబ్బతిని అక్కడ అడవి జీవరాసులు, వన సంపద ధ్వంసం అయ్యే అవకాశం ఉంది కావున పీవీ నరసింహారావు ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను వెంటనే నిలిపివేయాలి. ధర్మసాగర్ ఇనుపరాతిగట్టు అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ప్రాజెక్టుగా ప్రకటించాలి. రాంపూర్ డంప్ యార్డ్ ప్రజల సమస్యలను పరిష్కరించాలని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
కూన మొగిలి, మైస ఎర్రన్న, బౌరిశెట్టి వెంకటేశ్వర్లు లు ఆలపించిన చైతన్య గీతాలు ఆహుతులను ఆలోచింపచేసాయి.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు శ్రీనాథ్, ఆచార్య ఆంజనేయులు, డాక్టర్ రాములు,ఉమామహేశ్వరరావు, శ్రవణ్ కుమార్, ధర్మ ప్రకాష్, ప్రభాకరాచారి, శ్రీనివాస్, అశోక్, సుమలత, వందన,మంజుల తదితరులు పాల్గొన్నారు.