Site icon MANATELANGANAA

రాగ”సుధా”భరితము..గర్వించింది భారతము..!

రాగ”సుధా”భరితము..
గర్వించింది భారతము..!

(సుధామూర్తి పుట్టినరోజు)

💐💐💐💐💐💐💐💐

ఆమె..
కార్యేషు దాసి..
కరణేషు మంత్రి..
భోజ్యేషు మాత..
ఇవన్నీ పతిదేవునికి..

అయితే అంతకు మించి..
గొప్ప మగువ..
పరిపూర్ణ స్త్రీ..
మంచి దాత..చక్కని రాత..
ఆదర్శ నెలత..
భర్త నారాయణ..మూర్తి..
ఆమె..మానవతామూర్తి..
వ్యాపారిగా ఆయనకు కీర్తి..
ఉత్తమ మహిళగా
ఆమె ఆయన ఇంటికే దీప్తి..
అందుకే ఆమె కీర్తి
పతిదేవుణ్ణి మించి లోకవ్యాప్తి..!

ఆ పువ్వు పుట్టగానే
పరిమళించింది..
మెట్టినింట అడుగుపెట్టినంతనే
ఆ ఇల్లు పరవశించింది..
కుమారిగా సాధించింది పట్టాలు..
ఇల్లాలిగా సేవా కార్యక్రమాలతో
జమ చేసుకుంది
ఎన్నెన్నో మధురఘట్టాలు..!

ఒక పరిచయం..
ప్రణయంగా పరిణమించి..
వివాహబంధంగా
పరిణితి చెంది..
ఆమె అయింది
సుధామూర్తి..
ఆమె రాకతో..
పల్లవించింది ఆయన కీర్తి..
వారి సంస్థ ఇన్ఫోసిస్..
India క్యాప్లో గొప్ప ఫెదర్..
నిర్వహణలో దంపతులిద్దరూ
మేడ్ ఫర్ ఈచ్ అదర్..!

సేవ..ఆమె త్రోవ..
రచనల్లో..ఆమెది ప్రత్యేక కోవ..
ఎన్నో చేసి..
మొదట పద్మశ్రీ..
పిదప పద్మభూషణ్ అయింది
ఈ అపూర్వ మగువ..
ఇన్ఫోసిస్ పట్టమహిషి..
పతికి తగ్గ..తగ్గని షి..
పైకి మామూలుగా
కనిపించే మనిషి..
తరచి చూస్తే మహామనీషి..
దేశమెల్ల ఎరిగిన విదు”షీ”మణి..
నారాయణమూర్తి
సంపదల పరకామణి..
దేశం గర్వించదగ్గ
గొప్ప మహిళామణి..!

✍️✍️✍️✍️✍️✍️

(సురేష్..9948546286
7995666286)

Share this post
Exit mobile version