Site icon MANATELANGANAA

సామాజికన్యాయ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకం

తెలంగాణ సీనియర్ సిటిజన్స్ కమీషన్ ముఖ్య కమీషనర్ జస్టిస్ ఈద తిరుమలదేవి

 80 ఏండ్ల స్వాతంత్ర దేశంలో నేటికి ఆయా సమూహాల మధ్య  అసమానతలు  కొనసాగుతున్నాయని, ప్రత్యేకించి కన్న తల్లితండ్రులను నిర్లక్ష్యం చేయడం, వారి ఆస్తిని లాక్కొని ఇంటి నుండి గెంటి వేస్తూ అసమానతలు పెంచుతున్నారని సమాజంలోని సకల అసమానతలను తొలగించడంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలని తెలంగాణ సీనియర్ సిటిజన్స్ కమీషన్ ముఖ్య కమీషనర్ జస్టిస్ ఈద తిరుమల దేవి అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కేంద్రం హంటర్ రోడ్ లోని 'డి' కన్వెన్షన్ లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ 6వ రాష్ట్ర సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో గౌరవంగా జీవించే హక్కు కూడా ఉందని, అన్ని ఉండి ఇంటి నుండి గెంటి వేయబడుతున్న వృద్ధుల గూర్చి మాట్లాడి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు అకాడమి చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపి సమానత్వ సమాజ నిర్మాణంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో న్యాయవాదుల కీలకపాత్ర పోషించారని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా న్యాయవాదులు త్యాగపూరిత పోరాటం చేశారని నేడు దేశ వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక న్యాయ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించడం ఆనందపడాల్సిన విషయమని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా మెజార్టీ ప్రజలైన బహుజన వర్గాల హక్కులను సాధించి వారి వాటా సాధించడంలో న్యాయవాదులు అవసరముందని అన్నారు. అంబేద్కర్ న్యాయవాది కాబట్టే అణగారిన ప్రజలకు ఎన్నో హక్కులను రాజ్యాంగంలో పొందుపర్చారని ఆ హక్కులను సాధించడం కోసం న్యాయ బద్ధంగా పోరాటం చేయడంతో పాటు అణగారిన వర్గాల ఐక్యతతో రాజకీయ అధికారం సాధించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎల్ పి ఎ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్ జె శాంసన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ పిలుపునిచ్చిన ‘పే బ్యాక్ టు సొసైటీ’ లక్ష్యంగా నల్ల కోట్లతో నీలి విప్లవం నినాదంతో ఐ ఎల్ పి ఎ పనిచేస్తుందని మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ సిద్ధాంత పునాదితో నిరంతరం బహుజన అణగారిన పేద న్యాయవాదుల వృత్తి నైపుణ్యం కోసం కృషి చేస్తూనే బహుజన సమాజ చైతన్యం కోసం పని చేస్తున్నామని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని గ్రామ గ్రామానికి తీసుకెళ్లడమే ఐ ఎల్ పి ఎ లక్ష్యమని ఆయన అన్నారు. బి.సి మోర్చా జాతీయ అధ్యక్షులు చౌదరి వికాస్ పటేల్ అధ్యక్షతన జరిగిన సదస్సులో గౌరవ అతిధులుగా హనుమకొండ జిల్లా జడ్జిలు ఎం.ఆర్. సునీత వరంగల్ మొదటి అదనపు జిల్లా జడ్జి మైత్రేయి మాట్లాడుతూ ఎన్నో కష్టాలకోర్చి లా చదివిన వారికి జీవితంలో సెటిల్ కావడం కష్టంగా ఉందని అన్నారు.
ప్రారంభ సెషన్ అనంతరం నాలుగు సెషన్లల్లో సదస్సు వైభవంగా జరిగింది. 79 ఏండ్ల స్వాతంత్ర భారతంలో మహిళా స్వేచ్ఛ అనే అంశంపై ప్రొఫెసర్ ఇ. సుధారాణి, ఎస్ ఐ ఆర్ పేరుతో ఓట్ల తొలగింపు అనే అంశంపై ప్రొఫెసర్ గుగులోతు వీరన్న నాయక్, సామాజిక న్యాయం – బహుజనుల ఐక్యత అనే అంశంపై తెలుగు అకాడమీ రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రజాస్వామ్యంలో జడ్జీల నియామకం – లోపాలు అనే అంశంపై ఐ ఎల్ పి ఎ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొన్నం దేవరాజు గౌడ్ ఉపన్యాసాలు ఇచ్చారు. వీరితో పాటు మెటుపల్లి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దయ రాజారాం, బహుజన ముక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు దాసురాం నాయక్, ప్రొఫెసర్ డాక్టర్ కూరపాటి రమేష్, బ్యాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు డి నరేందర్,
బ్యాంసెఫ్ నాయకులు ఎ సంతోష్ కుమార్, ఐ ఎల్ పి ఎ నాయకులు తిప్పన డాంగే, తీగల జీవన్ గౌడ్, వి.ఎం. కృష్ణారెడ్డి, అనంత ఆంజనేయులు, భానుప్రియ, చిల్ల రమేష్, టి. డేవిడ్, మహమ్మద్ ముధసిర్ అహ్మద్, వెంకటయ్య ముదిరాజ్ తదితర మేధావులు హాజరై సందేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, సదస్సు కన్వీనర్ ప్రారంభోపన్యాసం ఇవ్వగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ వందన సమర్పణ చేశాడు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఐ ఎల్ పి ఎ నాయకులు జన్ను పద్మ, సామ హేమలత, లక్కినేని సత్యనారాయణ, మామిడాల సత్యనారాయణ, వల్లపు మధుసూదన్, బండి మొగిలి, భుజంగరావు, సిద్ధిరాములు, పులిగిల్ల బిక్షపతి, విలాసాగరం సురేందర్ గౌడ్, చింత సాంబశివరావు, పూసపల్లి శ్రీనివాస్, అవులూరి సత్యనారాయణ, రంగోజు బిక్షపతి, తల్లమల్ల హస్సేన్, గోపికృష్ణ, పూస మల్లేష్, ఎగ్గడి సుందర్ రామ్, మనీశ్వరి, బద్రు నాయక్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version