Site icon MANATELANGANAA

రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదులు ముందుండాలి

కొత్తగూడెం జిల్లా జడ్జి పాటిల్ వసంత్

పూలే, అంబేద్కర్ సిద్ధాంత బాటలోనే బహుజనులకు విముక్తి… ఐ ఎల్ పి ఎ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ జె శాంసన్

ఇంటింటికి రాజ్యాంగం ఐ ఎల్ పి ఎ లక్ష్యం… రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్

  ప్రజాస్వామ్యానికి ప్రధాన ఆధారమైన రాజ్యాంగ రక్షణ ద్వారానే సమానత్వం ఏర్పడుతుందని ఆ రాజ్యాంగ రక్షణలో న్యాయవాదులు ముందుండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. ఈ నెల 20, 21 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం క్లబ్ లో ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షురాలు సుజాత కె చౌదంటే అధ్యక్షతన జరిగిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ ఎల్ పి ఎ) తెలంగాణ 5వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మహాత్మ జ్యోతిరావు పూలే లాంటి మహానేయుల కృషి వల్ల అట్టడుగు వర్గాలకు విద్య అందిందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వల్ల అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అవకాశం దొరికిందని ఆ క్రమంలోనే నాలాంటి వాళ్ళు ఎందరో వివిధ స్థాయిల్లో అభివృద్ధి చెందారని అన్నారు. అలాంటి మహనీయుల స్పూర్తితో న్యాయవాధులతో పాటు, సమాజాన్ని చైతన్యం చేస్తున్న ఐ ఎల్ పి ఎ కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయని, న్యాయవాదులు వారి వృత్తిలో రాణించడంతో పాటు పోటీ పరీక్షల్లో నెగ్గడం కోసం ఐ ఎల్ పి ఎ ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమాలు న్యాయవాద వర్గానికు ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు. రాజ్యాంగ రక్షణలో న్యాయవాదులతో పాటు సమాజంలోని వివిధ వర్గాల వారు పనిచేయాలని అన్నారు. 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్ సరిత మాట్లాడుతూ సామాజిక చైతన్యంలో చొరవ తీసుకుంటున్న ఐ ఎల్ పి ఎ ని అభినందించారు. రాజ్యాంగం ప్రజలకు అందించిన హక్కుల ప్రచారంలో ఐ ఎల్ పి ఎ చేస్తున్న కృషి గొప్పదని అన్నారు. ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షురాలు సుజాత కె చౌదంటే మాట్లాడుతూ బహుజన సమాజాన్ని తీవ్రంగా అణచివేస్తున్న మనుధర్మ పాలనకు వ్యతిరేకంగా త్యాగపూరితంగా ఉద్యమిస్తున్న బాంసెఫ్ దేశ వ్యాప్త ఉద్యమానికి అనుబంధంగా ఐ ఎల్ పి ఎ వెన్నుదన్నుగా నిలిచిందని, తెలంగాణ రాష్ట్రంలో ఐ ఎల్ పి ఎ కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని, రాష్ట్రంలోని 100 కు పైగా బార్ అసోసియేషన్లకు సంబంధించిన న్యాయవాదులను ఐ ఎల్ పి ఎ లో భాగస్వామ్యం చేయడం గొప్ప విషయమని అన్నారు. పూలే, అంబేద్కర్ బాజాలంతో పాటు రాజ్యాంగ హక్కులను అణగారిన ప్రజలకు చేరవేయడంలో ఐ ఎల్ పి ఎ చిత్తిశుద్ధితో పనిచేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీకి శుభాకాంక్షలు తెలియచేసి రాష్ట్ర శాఖ కార్యక్రమాలకు  జాతీయ సంఘం నుండి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని అన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు ఆమె ఐ ఎల్ పి ఎ జెండాను ఆవిష్కరించగా ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సి హెచ్ సిద్ధిరాములు వివిధ జిల్లాల నుండి హాజరైన న్యాయవాధులచే ఐ ఎల్ పి ఎ ప్రతిజ్ఞను చేపించారు. ప్రారంభ సభకు ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు మదీనా సాదిక్ పాషా స్వాగత వచనాలు పలుకగా ఐ ఎల్ పి ఎ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఎన్ జె శాంసన్ సంఘం గత సంవత్సర కార్యకలాపాల నివేదికను చదివి వినిపించగా గౌరవ అతిథిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సదస్సు స్వాగత కమిటీ కన్వీనర్ లక్కినేని సత్యనారాయణ, ముఖ్య వ్యక్తులుగా కర్నాటక రాష్ట్ర హై కోర్టు సీనియర్ న్యాయవాది ఎస్ బాలన్, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ సుజాత సూరెపల్లి హాజరై వారి సందేశాన్ని ఇచ్చారు. వ్యక్తులుగా హాజరైన ఐ ఎల్ పి ఎ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు పొన్నం దేవరాజ్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి లక్ష్మీదేవి, పూర్వ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీసాయిని నరేందర్, న్యాయవాది అదనన్ క్యుమర్ లు ఐ ఎల్ పి ఎ పనితీరు గురించి వివరించగా ఐ ఎల్ పి ఎ కొత్తగూడెం బార్ కన్వీనర్ జె గోపికృష్ణ ప్రారంభ సదస్సుకు వందన సమర్పణ చేశారు.

రాజ్యాంగ విలువలు – ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ ప్రజల స్థితిగతులు అనే అంశంపై కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్ బాలన్ మాట్లాడుతూ వేల సంవత్సరాల నుండి దేశంలో అణిచివేయబడిన దేశ మూలవాసుల దేశ మూలవాసులైన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి రక్షణకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఎన్నో అంశాలను పాలకులు ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని తద్వారా అన్నగారిన ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. రాజ్యాంగ విలువలు రాజ్యాంగ హక్కుల గురించి సామాన్య, అనగారిన ప్రజలకు బోధించడంలో న్యాయవాదులు క్రియాశీల పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక – ఇ డబ్ల్యు ఎస్, ఒబిసి లకు మరో విధానం అనే అంశంపై సిద్ధార్థ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు మాట్లాడారు. అణగారిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లను పాలకుల దయా దాక్షిణంతో ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని, బ్రిటిష్ కాలంలో రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ జరిపిన చర్చల పలితంగా అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తామనే హామీలో బాగంగా రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. ఆర్టికల్ 340 ప్రకారం బి.సి ల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల పట్ల పాలకులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని, కుల జనగణన జరపకుండా, సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బి.సి లకు దక్కాల్సిన వాటాను అడ్డుకుంటున్న పాలకులు కుటిల రాజకీయాలను న్యాయవాదులు అర్థం చేసుకోవాలని అన్నారు. 1990 మండల్ కమీషన్ అమలు నుండి నేటి కామారెడ్డి డిక్లరేషన్ వరకు బి.సి ల వాటాపై ఉన్నత న్యాయస్థానాలు కూడా వివక్ష చూపుతున్నాయని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఇ డబ్ల్యు ఎస్) కు లేని రిజర్వేషన్ల పరిమితి ఒబిసి రిజర్వేషన్లకు కోర్టులు ఎందుకు విధిస్తున్నారో న్యాయవాదులు అధ్యయనం చేసి ఒబిసి ల పక్షాన ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇ డబ్ల్యు ఎస్ రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా నష్టపోయేది బి.సి లని, ఐఐటి, ఐఎఎస్, ఐపిఎస్, డాక్టర్ విద్య లాంటి కోర్సుల్లో బి.సి లకు తీరని నష్టం వాటిల్లుతుందని, ఇప్పుడిపుడే ఎదుగుతున్న అనగారిన ప్రజలను అడ్డుకోవడానికి క్రిమిలేయర్ విధానం తీసుకొచ్చారని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్లలో బహుజన కోటా అనే అంశంపై ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ప్రసంగిస్తూ 75 ఏండ్ల స్వాతంత్ర భారతంలో బహుజన మహిళలకు అన్ని రంగాల్లో అన్యాయమే జరుగుతుందని, సకల రంగాలకు పునాది లాంటీ రాజకీయ రంగంలో మహిళలకు నామమాత్ర ప్రాతినిధ్యం ఉందని అన్నారు. రాజకీయ రంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేశారని ఆ రిజర్వేషన్లలో భోజన కోట కల్పించకపోవడం దుర్మార్గమని అన్నారు ఇంతవరకు బ్రాహ్మణీయ ఆధిపత్య కులాలకు చెందిన పురుషులు రాజకీయ పదవులు అనుభవించారని మహిళా రిజర్వేషన్లు పేరుతో ఆధిపత్య కులాల మహిళలు రాజ్యమేలడానికి సిద్ధమయ్యారని అన్నారు. వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైన బహుజన మహిళలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారని అలాంటి బహుజన మహిళా లోకానికి రాజకీయ అవకాశాలు దక్కకుండా చేయడం కోసమే బహుజన కోటా లేని మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించారని విమర్శించారు. మహిళా బిల్లులో బహుజన కోటా కోసం బహుజన సమాజం ఐక్యంగా పోరాటం చేసి సాధించుకోవాలని అన్నారు.
బార్ రూమ్ నుండి కోర్టు రూమ్ వరకు న్యాయవాదులకు రక్షణ అంశంపై కర్నాటక సీనియర్ న్యాయవాది ఎస్ బాలన్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు రక్షణ చట్టాలు ఉన్నాయని ప్రజలను రక్షణ చట్టాలను అమలుపరచడంలో కీలక పాత్ర పోషించే న్యాయవాదుల రక్షణ చట్టం లేకపోవడం వల్ల న్యాయవాదులపైనే కాకుండా న్యాయమూర్తులపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. న్యాయవాద నాయకులు, విధాన రూపకర్తలు న్యాయవాద రక్షణ చట్టం ఆవశ్యకతను గుర్తించి వెంటనే భారతదేశంలో న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేసారు.

ఐ ఎల్ పి ఎ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్ జె శాంసన్, సాయిని నరేందర్

 ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 5వ రాష్ట్ర మహాసభలో ఐ ఎల్ పి ఎ 140 మందితో నూతన రాష్ట్ర కమిటీని నియమించగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా హైదరాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది ఎన్ జె శాంసన్, హనుమకొండ బార్ కు చెందిన న్యాయవాది సాయిని నరేందర్ ను ప్రధానకార్యదర్శిగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా దయాల రాజారాం, పొన్నం దేవరాజ్ గౌడ్, కోశాధికారిగా గాంగేయుడు (రంగారెడ్డి), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె వెంకటేష్ ప్రసాద్ (హైదరాబాద్), సామ హేమలత (రంగారెడ్డి), బిచాల తిరుమలరావు (ఖమ్మం), చిల్లా రాజేంద్రప్రసాద్ (హనుమకొండ), భుజంగరావు (మంచిర్యాల), సిద్ధి రాములు (కామారెడ్డి), నిజాముద్దీన్ (సంగారెడ్డి), గోదా వెంకటేశ్వర్లు (భువనగిరి), గోపికృష్ణ (కొత్తగూడెం), దత్తాత్రేయ (మహబూబ్ నగర్) లను ఎన్నుకోగా ఉపాధ్యక్షులుగా 24 మందిని, సంయుక్త కార్యదర్శులుగా 36 మందిని, స్పోర్ట్స్, సాంకృతిక సెక్రటరీలుగా నలుగురిని, రాష్ట్ర కార్యనిర్వహక సభ్యులుగా 50 మందిని ఎన్నుకోగా సంఘానికి ముఖ్య సలహాదారులుగా బాస రాజేశ్వర్, కర్రె లచ్చన్న, డాక్టర్ తిప్పన లను ఎన్నుకున్నారు. 
నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్ జె శాంసన్ మాట్లాడుతూ 2014 నుండి ఐ ఎల్ పి ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నాకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన నియామక కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘ సంఘ నిర్మాణం కార్యక్రమాల పట్ల బాధ్యతతో వ్యవహరించి ముందుకు సాగుతానని రాష్ట్ర కమిటీ లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు సహకరించాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ పూలే అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే ఐ ఎల్ పి ఏ ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్తామని మొదట న్యాయవాదులను చైతన్యం చేసి తర్వాత ప్రతి గ్రామానికి రాజ్యాంగాన్ని పరిచయం చేస్తామని గడపగడపకు రాజ్యాంగ విశిష్టతను తెలియపరుస్తామని తద్వారా బహుజన సమాజాన్ని చైతన్యం చేసి ప్రజాస్వామ్య రక్షణతో పాటు విలువలతో కూడిన బహుజన రాజ్య ఏర్పాటుకు కృషి చేస్తామని, అంబేద్కర్ బోధించిన పే బ్యాక్ టు సొసైటీ సిద్ధాంతం ద్వారా న్యాయవాదులకు ఆనగారిన వర్గాలకు మేలు చేస్తామని అన్నారు. 

నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీకి ఐ ఎల్ పి ఎ జాతీయ అధ్యక్షురాలు సుజాత కె చౌదంటే, జాతీయ ఒబిసి మోర్చా కన్వీనర్ డాక్టర్ హరిప్రసాద్, ఐ ఎల్ పి ఎ నాయకులు, న్యాయవాదులు గుగులోతు బద్రు నాయక్, అకినపల్లి వీరస్వామి, కిషోర్ అంబేద్కర్, అవులూరి సత్యనారాయణ, తొండపు వెంకటేశ్వరరావు, భానుప్రియ, సామ హేమలత, ఎం. సుమలత, మగ్గిడి నర్సయ్య, బిచాల తిరుమలరావు, ఎర్ర కామేష్, జి వెంకటేశ్వర్లు, మారపాక రమేష్ కుమార్, మల్లెల ఉషారాణి, పులి సత్యనారాయణ, వలస సుధీర్, పంచగిరి బిక్షపతి, మెరుగు రవీందర్, జవ్వాజి శ్రీనివాస్, లక్డి భాస్కర్, వి ఎం కృష్ణా రెడ్డి, తీగల జీవన్ గౌడ్, గజ్జల వెంకటరెడ్డి, ముద్దసాని సహోదరరెడ్డి, రాపోలు భాస్కర్, నల్ల మహాత్మా, అల్లం నాగరాజు,. దయాల సుధాకర్, గుడిమల్ల రవికుమార్, ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి, చిల్ల రమేష్, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, నబీ, విలాసాగరం సురేందర్ గౌడ్, పొడిచేటి శ్రీనివాస్, జన్ను పద్మ, లడే రమేష్, హస్సేన్, మామిడాల సత్యనారాయణ, అయోధ్య, సత్యనారాయణ పిళ్ళై, వేముల రమేశ్, గురిమిల్ల రాజు, కె నిర్మలా జ్యోతి, శ్రీలత, వివిధ సంఘాల నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య, బొలిశెట్టి రంగారావు, డాక్టర్ కూరపాటి రమేష్, డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, సంగాని మల్లేశ్వర్, చింతం లక్ష్మీనారాయణ, తాడిశెట్టి క్రాంతికుమార్, చాపర్తి కుమార్ గాడ్గే, తదితరులు అభినందనలు తెలిపారు.

Share this post
Exit mobile version