ఆఫ్ మార్తాన్ నిర్వహిస్తున్న కారణంగా వరంగల్, హన్మకొండ మరియు కాజిపేట్ లో ఈ నెల 23 న ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించారు.
తేదీ 23-11-2025 రోజున ఉదయం 0400 గంటల నుండి 1000 గంటల వరకు ఆఫ్ మార్తాన్ (Half Marathon) పరుగు ఉన్నందున వరంగల్, హన్మకొండ మరియు కాజిపేట్ పౌరులకు/ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా తేదీ: 23-11-2025 రోజున ఉదయం 0400 గంటల నుండి 1000 గంటల వరకు వరకు ఈ క్రింద తెలుపబడిన విదంగా ట్రాఫిక్ నిబందనలు ఉంటాయని పోలీస్ కమీషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
- హైదరాబాదు నుండి హన్మకొండ కు వచ్చు వాహనాల/బస్సులు ఫాతిమా నుండి మదర్ తెరిసా- సెంటర్ నుండి ఎడమవైపు వడ్డేపల్లి చర్చ్- తులసి బార్- కేయుసి జంక్షన్- నయీమ్ నగర్- సిపిఓ జంక్షన్- హన్మకొండ బస్టాండ్ కు చేరుకోవలెను
- హన్మకొండ నుండి హైదరాబాదుకు వెళ్లే వాహనాలు/బస్సులు అశోక జంక్షన్ మీదుగా ములుగు రోడ్డు- పెద్దమ్మ గడ్డ- కేయుసి- తిరుమల బార్ – వడ్డేపల్లి చర్చి- ఫాతిమా సెంటర్- కాజీపేట మీదుగా హైదరాబాదుకు వెళ్ళవలెన.
- హన్మకొండ నుండి కరీంనగర్ కు వెళ్ళు వాహనాలు/బస్సులు అశోక జంక్షన్ మీదుగా ములుగు రోడ్డ- పెద్దమ్మ గడ్డ – కేయుసి మీదుగా వెళ్ళవలెను.
- ఖమ్మం నుండి హన్మకొండ వచ్చు వాహనాలు/బస్సులు సిఎస్ఆర్ గార్డెన్ జంక్షన్ నుండి డైవర్షన్ తీసుకుని పోతన జంక్షన్ వైపు మీదుగా హన్మకొండకు వెళ్ళవలెను.
గమనిక:- 100 ఫీట్స్ రోడ్డు నందు ఒకవైపు మాత్రమే వాహనాలు అనుమతించబడును
ఈ కింద తెలిపిన మార్గాలలో తేదీ: 23-11-2025 రోజున ఉదయం 0400 గంటల నుండి ఉదయం 1000 గంటల వరకు ఎలాంటి వాహనాలు అనుమతించబడవు
సి ఎస్ ఆర్ గార్డెన్ జంక్షన్ నుండి అదాలత్ వైపు
అంబేద్కర్ జంక్షన్ నుండి కాళోజి జంక్షన్ వరకు
ఫాతిమా జంక్షన్ నుండి ఎన్ఐటి వైపుకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు
ఇట్లు
సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్ వరంగల్ పోలీస్ కమిషనర్

