Site icon MANATELANGANAA

లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన గ్రామ పంచాయితీ కార్యదర్శి

నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం గొట్టుముక్కుల గ్రామ పంచాయతీ కార్యదర్శి – కట్కం గంగ మోహన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

రూ. 18 వేల లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కాడు.

ఫిర్యాదుధారునికి సంబంధించిన ఇంటికి నంబరు కేటాయించేందుకు బహిరంగ ప్లాట్‌కు అసెస్‌మెంట్ నంబర్‌ ల కోసం కార్యదర్శి రూ 20 వేలు డిమాండ్ చేసారు. ఇంటియజమాని బ్రతిమిలాడితే రెండువేలు తగ్గించి 18 వేలకు ఒప్పుకున్నాడు. భాదితుడుఏసీబీ అధికారులను ఆశ్రయించడం తో కార్యదర్శిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
లంచం తీసుకున్న గంగమోహన్ పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమను సంప్రదించాలని “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) ఇంకా  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Share this post
Exit mobile version