Site icon MANATELANGANAA

చమురు వదులుతోంది…….

oil oil oil

చమురు …ప్రపంచాన్ని నడిపిస్తోంది..ఉరుకులు…పరుగులతో ఇందనశక్తి
ప్రపంచ రథచక్రాలు తిరిగేందుకు నిరంతరాయంగా మండి ఆవిరవుతోంది.
మనిషి తన మనుగడ కోసం భూగర్భం పాతాళంలో అడగంటి పోయినా.. చమురును వదలడం లేదు.
చమురుకు ప్రత్యామ్నాయంగా ఇందన వనరుల అన్వేషణ మరోవైపు కొనసాగుతోంది.
చమురుకు ప్రత్యామ్నాయంగా మరోవైపు సౌరశక్తి వినియోగంపై మానవులు దృష్టి సారించారు.
సౌరశక్తే తన భవిష్యత్ అవసరాలకు ప్రధాన ప్రత్యామ్నాయం కాగలదని భావిస్తు ముందుకు సాగుతున్నా ఇప్పటికైతే చమురు మానవున్ని శాసిస్తోంది.
అందుకే ఇందన నిల్వలు కలిగిన దేశాలు ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు, వినియోగం, నిల్వలు, పర్యావరణ అనుకూల శక్తి వనరులపై ఆశ్చర్య కరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రపంచంలో అత్యంత చౌకైన ధరకే పెట్రోల్ వెనెజులాలో లభిస్తోంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ. 1.60 మాత్రమే! దీనికి కారణం ఆ దేశంలోని ప్రభుత్వం సబ్సిడీలు ఎక్కువగా ఇస్తుంది. ఈదేశంలో ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. డీజిల్ ధరలు కూడా ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి, లీటరుకు సుమారు రూ. 1.20. ఇరాన్, లిబియా వంటి దేశాలు కూడా చౌకైన ఇంధన ధరల జాబితాలో ఉన్నాయి, ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 4 నుండి రూ. 10 మధ్య ఉంటుంది.

ముడి చమురు నిల్వలలో వెనెజులా అగ్రస్థానంలో ఉంది, 2023 గణాంకాల ప్రకారం 303,220 మిలియన్ బ్యారెల్స్ నిల్వలతో ముందుంది. సౌదీ అరేబియా 267,230 మిలియన్ బ్యారెల్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఇరాన్, కెనడా, ఇరాక్ కూడా గణనీయమైన నిల్వలను కలిగి ఉన్నాయి.
అపారమైన నిల్వలు ప్రధానంగా వెనెజులాలోని ఒరినోకో బెల్ట్లో ఉన్నాయి, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రాలలో ఒకటి. అయితే, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, మరియు అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఈ నిల్వలను సమర్థవంతంగా వినియోగించడంలో వెనెజులా సవాళ్లను ఎదుర్కొంటోంది.

మరోవైపు, హాంకాంగ్‌లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర సుమారు రూ. 250! డీజిల్ ధర కూడా లీటరుకు రూ. 200 పైనే ఉంది. నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ దేశాల్లో కూడ ఇందన ధరలు మండిపడున్నాయి. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 150 నుండి రూ. 200 మధ్య ఉంటుంది. అధిక పన్నులు, ఉత్పత్తి వ్యయం అధికం కావడమే కారణం.

ఇంధన వినియోగంలో అమెరికా ప్రపంచంలోనే అగ్ర భాగంలో నిలిచింది. 2022 గణాంకాల ప్రకారం, అమెరికా రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెల్స్ చమురును వినియోగిస్తోంది. ఇది ప్రపంచ వినియోగంలో సుమారు 20శాతం మని చెబుతున్నారు. అమెరికా తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. చైనా రోజుకు 14 మిలియన్ బ్యారెల్స్ వినియోగిస్తోంది.

ఇంధన వినియోగం లో భూటాన్, మాల్దీవులు వంటి చిన్న దేశాలు అత్యల్పంగా వినియోగిస్తున్న దేశాలలో మొదటి వరుసలో ఉన్నాయి. ఈ దేశాలు రోజుకు కేవలం 5,000 నుండి 10,000 బ్యారెల్స్ చమురును మాత్రమే వినియోగిస్తాయి. ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి అతిక్కువ జనాభా కూడ కారణంగా చెప్పవచ్చు.

అత్యల్ప చమురు నిల్వలు ఉన్న దేశాలలో జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఉన్నాయి, ఇవి కేవలం 1-2 మిలియన్ బ్యారెల్స్ నిల్వలను మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ దేశాలు తమ ఇంధన అవసరాలకు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడతాయి.

సౌరశక్తి వినియోగంలో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024 నాటికి, చైనా 430 గిగావాట్లకు పైగా సౌరశక్తి సామర్థ్యాన్ని స్థాపించింది, ఇది ప్రపంచ సౌరశక్తి సామర్థ్యంలో సుమారు 40శాతంగా వాటాగా గణాంకాలు చెబుతున్నాయి. జర్మనీ, జపాన్, మరియు భారతదేశం కూడా సౌరశక్తి వినియోగంలో ముందున్నాయి. భారతదేశం 2024 నాటికి 70 గిగావాట్ల సౌరశక్తి సామర్థ్యాన్ని సాధించి భవిష్యత్ లో దాని పునర్వినియోగ శక్తి లక్ష్యాల మరింతగా పెంచుకునే దిశగా వెళుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇందనానికి ప్రత్యామ్నాయంగా సులభంగా వినియోగించే మార్గంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఇందు కోసం అత్యధిక రాయితీలు ఇస్తున్నారు. సాంకేతికంగా విద్యుత్ వాహనాల వినియోగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. సోలార్ పవర్ కూడ మరోప్రత్యామ్నాయం కాగలదని ఆ దిశగా అన్వేషణలు ప్రయోగాలు వేగం పుంజుకున్నాయి.

Share this post
Exit mobile version