Site icon MANATELANGANAA

శోభనం ఫలించలేదనే నెపంతో 2 కోట్లపరిహారం డిమాండ్ చేసిన భార్య

bharanam

బెంగళూరు: వైవాహిక జీవితంలో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి తర్వాత శోభనం రాత్రి భర్త తనకు శారీరకంగా దగ్గర కాలేదంటూ ఓ యువతి రూ.2 కోట్ల పరిహారం డిమాండ్ చేసింది. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి రావడంతో పెద్ద చర్చనీయాంశమైంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, చిక్కమగళూరు జిల్లా కేఎమ్. ప్రవీణ్‌కు మే 5న చందన అనే యువతితో వివాహం జరిగింది. మే 16న ప్రవీణ్ మేనత్త ఇంట్లో ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేశారు. అయితే, శారీరక–మానసిక ఒత్తిడి కారణంగా ప్రవీణ్ భార్యకు దగ్గర కాలేకపోయాడు. దీనిపై చందన వైద్య పరీక్షలు చేయించమని ఒత్తిడి చేసింది. డాక్టర్లు ప్రవీణ్‌లో ఎలాంటి లోపం లేదని, కేవలం ఒత్తిడి కారణంగా కొంత విశ్రాంతి అవసరమని స్పష్టంచేశారు.

అయితే, చందన దీనిని పట్టించుకోకుండా రచ్చ మొదలుపెట్టిందని ప్రవీణ్ కుటుంబం ఆరోపించింది. జూన్ 7న పంచాయతీ ఏర్పాటు చేసి రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చిందని తెలిపారు. ఆగస్టు 17న చందన, ఆమె బంధువులు ఇంట్లోకి వచ్చి తనపై దాడి చేశారని ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదులో భార్య తన పరువును మంటగలిపిందని, బంధువులు బెదిరింపులకు దిగారని వాపోయాడు. ఈ ఘటనలో తాను గాయపడ్డానని, సీసీటీవీ ఫుటేజీతో పాటు మెడికల్ రిపోర్టులను కూడా పోలీసులకు సమర్పించాడు.

ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share this post
Exit mobile version