సిద్దిపేట జిల్లా నర్మెట్టలో “రైతు ఉత్సవాలు”.
రైతు భరోసా నిధుల విడుదల – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో “ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు
. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి Revanth Reddy హాజరై రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు Tummala Nageswara Rao, Damodar Raja Narasimha, Ponguleti Srinivasa Reddy, Ponnam Prabhakar, Vivek Venkataswamy, ప్రభుత్వ సలహాదారు Sudarshan Reddy, ఎంపీలు Raghunandan Rao, Vem Narender Reddy, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రైతు భరోసా నిధుల విడుదల
కార్యక్రమంలో భాగంగా సీఎం రైతు భరోసా నిధులను విడుదల చేశారు. మూడు విడతల్లో రూ. 9,000 కోట్లను 45 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
రైతు సంక్షేమం – ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు” అని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం విషయంలో ఎటువంటి లోటు ఉండనివ్వబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ కాలంలో నెలకు సగటున రూ. 2,533 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తమ ప్రభుత్వం గత 28 నెలల్లో నెలకు రూ. 5,500 కోట్లు రైతుల కోసం ఖర్చు చేస్తోందని తెలిపారు. రెండేళ్లలో రైతు సంక్షేమం కోసం లక్ష కోట్లకు పైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు.
పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల కోసం ప్రతీ నెల రూ. 2533 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
28 నెలల్లో ప్రతీ నెల రూ.5500 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నామన్నారు.
పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించుకుంటున్నా మని ప్రజా ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం రెండేళ్లలో లక్ష కోట్లకుపైగా ఖర్చు చేశాం దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు.
వ్యవసాయంలో మార్పు రావాలి. రైతులు పంట మార్పిడి విధానం అనుసరించాలిగతంలో ప్రాంతాల వారీగా వివిధ రకాల పంటలు పండించేవారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పండ్ల తోటలు ఎక్కువగా కనిపించేవి
వరి ఒక్కటే కాదు… అన్ని రకాల పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది
ఈసారి 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశాం
కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులకు మించి కొనడం లేదు.
అందుకే పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలి
అందుకు అవసరమైన ప్రణాళికలు తీసుకురావాలి
ఆయిల్ పామ్ వ్యవసాయాభివృద్ధి
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు 3 లక్షల ఎకరాలకు చేరిందని, దీన్ని 10 లక్షల ఎకరాలకు విస్తరించినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు సూచించారు. అంకాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు.
మహిళల సాధికారతకు ప్రాధాన్యం
ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని సీఎం పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినట్లు తెలిపారు. ఒక కోటి మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు బ్యాంకు లింకేజీల ద్వారా రూ. 57 వేల కోట్ల రుణాలు మహిళలకు అందించామని వివరించారు.
విద్యా, ఉపాధి రంగాలపై చర్యలు
వచ్చే విద్యా సంవత్సరంనుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్థాయికి తీసుకెళ్తామని సీఎం ప్రకటించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఎరువుల కొరతపై హెచ్చరిక
ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఎరువుల కొరత వచ్చే అవకాశముందని సీఎం హెచ్చరించారు. కేంద్రంతో సమన్వయం చేసి రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రాజకీయాలకు ఇది సమయం కాదు
ఇది రాజకీయాల సమయం కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. అన్ని 119 నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
సిద్దిపేటపై ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేసిన సీఎం, ప్రజలు మార్పుకు అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
