Site icon MANATELANGANAA

17 ఏళ్ల యువతికి అత్యవసర లివర్ మార్పిడి

ఉస్మానియా ఆసుపత్రిలో అత్యవసరంగా 17 ఏళ్ల యువతికి లివర్ మార్పిడి చేసిన ప్రాణం నిలిపిన వైద్యులు

హైదరాబాద్, జూలై 18:
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం ప్రభుత్వ రంగ వైద్యంలో అరుదయిన రికార్డు స్వంతం చేసుకుంది. 17 ఏళ్ల యువతికి ‘సూపర్ అర్జెంట్’ శ్రేణిలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా నిర్వహించి ఆమెకు ప్రాణదానం చేసింది. ఇది జీవందాన్ పథకం ద్వారా సూపర్ అర్జెంట్ కేటగిరీలో తొలిసారిగా ఒక పేద రోగికి ప్రభుత్వం ద్వారా లభించిన లివర్ మార్పిడి కావడం విశేషం.

ఫిల్మ్‌నగర్‌కు చెందిన బ్లెస్సీ గౌడ్ అనే యువతి తీవ్రమైన లివర్ ఫెయిల్యూర్‌తో బాధపడుతూ, 2025 మే 12న

ఉస్మానియా ఆసుపత్రికి లో చేరింది. ఆమెకు గ్రేడ్-4 హేపాటిక్ ఎన్‌సెఫలోపతి (కోమా స్థితి) ఉండటంతో వెంటిలేటర్‌ పై ఉంచారు. ఆమెకు 5 రోజుల నుండి జ్వరం, జాండిస్ లక్షణాలు ఉండగా, ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందినా పరిస్థితి మరింత విషమించి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉస్మానియాకి తీసుకువచ్చారు.

వైద్య పరీక్షల్లో బిలిరుబిన్ స్థాయి 23 mg/dl, INR 11, లాక్టేట్ 7.3 గా నమోదు కాగా, ఆమె పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉండటంతో 48 గంటల్లో లివర్ మార్పిడి లేకపోతే ప్రాణాపాయం అని డాక్టర్లు పేర్కొన్నారు. ఆమెకు సరిగ్గా సరిపోయే దానం కుటుంబంలో లభించకపోవడంతో, జీవందాన్‌కు అత్యవసర కేటగిరీలో అభ్యర్థన పంపారు.

జీవందాన్ నిపుణుల కమిటీ సమీక్షించి 24 గంటలలోగా బ్రెయిన్‌డెడ్ దాతల ద్వారా లివర్‌ను కేటాయించింది. మే 14న శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. 20 గంటల పాటు కొనసాగిన శస్త్రచికిత్స తర్వాత యువతి పూర్తిగా కోలుకుని 2 వారాల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యింది. ప్రస్తుతం ఆమె బీటెక్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తోంది.

ఉస్మానియా ఆసుపత్రి శస్త్ర చికిత్స విభాగం హెడ్ డా. మధుసూధన్ గారు, జీవందాన్, తెలంగాణ ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ, సూపరింటెండెంట్, డాక్టర్లు, నర్సులు మరియు సిబ్బంది అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేశారు.

Share this post
Exit mobile version