Site icon MANATELANGANAA

ఎసిబికి పట్టుబడిన హైదరబాద్ నగర లంచగొండి విద్యుత్ ఏఇ

acb traped

ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ధృవీకరణ పత్రం జారి చేసేందుకు హైదరాబాద్ నగరంలోని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఎ. జ్ఞానేశ్వర్‌ లంచం తీసుకుంటుండగా బుధవారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు.
జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్ TGSPDCL ప్రగతినగర్ లోని సహాయక ఇంజనీరు (ఆపరేషన్స్)గా పనిచేస్తున్నాడు. ఓఇంటి యజమాని 9 విద్యుత్ మీటర్లు అమర్చేందుకు ధరఖాస్తు చేసుకున్నారు. ఇందు కోసం 63 KV ట్రాన్స్‌ ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు ధృవీకరణ పత్రం జారీ చేసేందుకు ఏఇ 50వేల లంచం డిమాండ్ చేశాడు. ఇంటియజమాని ఈవిషయం ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఒప్పుకున్న అమౌంట్ లో పదివేల లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (
@TelanganaACB) ఇంకా ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునని అధికారులుతెలిపారు.”ఫిర్యాదుధారులు, బాధితుల వివరములు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Share this post
Exit mobile version