చెలిమి సాహిత్య సాంసృతిక వేదిక, వరంగల్లు వారి సారద్యంలో రిటైర్ కాలేజీ టీచర్స్ అసోషి మేషన్ సౌజన్యం తో శుక్రవారం హన్మకొండ లో మెట్టు మురళీధర్ రచించిన ‘ధరణి’ నవల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ సమావేశానికి చెలిమి సాహిత్య సాంసృతిక వేదిక కన్వీనర్ మెట్టు రవీందర్ అద్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా, పుస్తకావిష్కర్త గా వచ్చిన
డా. అంపయ్యనవీన్ మాట్లాడుతూ ప్రజలు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను సాహితీకరించడంలో మెట్టు మురళీధర్ సిద్ద హస్తుడని పేరొన్నారు. ధరణి పోర్టల్ వలన రైతులు ఎదుర్కొన్న కష్టాలని ఈ నవల కళ్ళకు కట్టిందన్నారు.
విశిష్ట అతిథిగా వచ్చిన డా. నందిని సిద్ధా రెడ్డి మాట్లాడుతూ ప్రజల జీవితాలన్నీ భూమితోనే ముడి పడి ఉన్నాయని, రైతుల సమస్యలతో పాటు అన్ని సమస్యల పరిష్కారానికి ప్రజాచైతన్యమే పరిషారమన్నారు..
మరొక విశిష్ట అతిధి వుష్పల బాలరాజు గారు ప్రభుత్వాలు సమగ్ర భూసర్వే’ చేపట్టకపోవడమే రైతుల కష్టాలకు కారణమన్నారు.
రిటైర్ కాలేజ్ టీచర్స్ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ , జిల్లా అద్యక్షులు పులి సారంగపాణి విశిష్ట – అతిధులుగా పాల్గొన్న ఈ కార్యక్రమం లో నాగిళ్ళరామశాస్త్రి, వి.ఆర్. విద్యార్థి , గంటా రామిరెడ్డి, రచయిత బంధుమిత్రులు, ఇతర సాహితీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.

