Site icon MANATELANGANAA

వన ప్రవేశం  చేసిన వన దేవతలు

ఎస్.ఎస్. తాడ్వాయి మండలం.
ములుగు జిల్లా.

వన ప్రవేశం  చేసిన వన దేవతలు.

బుధవారం సారలమ్మ రాక తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమై,
ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా.. శుక్రవారం, శనివారం  అశేష భక్త జనం వన దేవతలకు మొక్కులు సమర్పించారు.

భక్తులు పోటెత్తడంతో మేడారం జనజాతరను తలపించింది. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి.. బంగారం తులా భారం,
మొక్కులు సమర్పించారు.

జాతర నేపథ్యంలో.. భక్తిశ్రద్ధలతో వనదేవతలకు దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించారు.

శనివారం  ఇద్దరు తల్లులు
కన్నెపల్లికి సారలమ్మ, చిలకలగుట్టకు సమక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లారు.

సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో సాయంత్రం ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత పూజారులు రాత్రి 7.55 నిమిషాలకు వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసింది.

*వైభవం గా, సంప్రదాయబద్దంగా..వన జాతర*

*పోరాటం, త్యాగం,నమ్మకాల సమ్మిలితామే మేడారం జాతర*

*వనం లోకి  వన దేవత లు*

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026 భక్తిప్రపత్తుల మధ్య ఘనంగా ముగిసింది.

వన దేవతలు సమ్మక్క, సారలమ్మ లు గద్దెలను  శనివారం 7.గంటల 55నిమిషాలకు వీడి వన ప్రవేశం  చేయడంతో ఈ జాతర పరిసమాప్తమైంది.

వేలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య, ఉద్విగ్న వాతావరణంలో
అమ్మవార్లు చిలకలగుట్టకు, కన్నెపల్లికి, పయనమయ్యారు.

భక్తులు అమ్మవార్లకు “వన దేవతలు వనం లోకి” అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు.

2026 జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.

మేడారం జాతరకు  రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా….మధ్యప్రదేశ్, చ త్తి స్ ఘడ్, ఒడిశా ఇలా దేశ నలుమూలల నుండి జాతర కి విచ్చేసి…అమ్మలకు మొక్కులు చెల్లించుకుని…. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.

తిరుగు ముఖం పట్టిన భక్తులు

*దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమైన భక్తులు*


ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరు గావించిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కు దేశం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తి  వచ్చారు. నాలుగు రోజులుగా మేడారం పరిసర ప్రాంతాలు అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తుల తో కిట కిట లాడాయి..

మేడారం జాతర లో చివరి రోజు నేడు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం జరుగుతున్న నేపథ్యంలో అమ్మవార్లను దర్శించుకునీ భక్తులు తిరిగి వారి వారి స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు..

భక్తుల తిరుగు ప్రయాణం సందర్భంగా ఆర్.టి.సి బస్టాండ్ ప్రాంతం లోని క్యూ లైన్లు నిండిపోయాయి.ఇప్పటి వరకు దాదాపు 12వేల ట్రిప్పుల బస్సులు నదిచినట్లు అధికారులు తెలిపారు.భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన గుడారాలు,టెంట్లు కాళిగా దర్శనమిస్తున్నాయి. భక్తులు తమ  సామగ్రినీ, పిల్లలను చేతిలో పట్టుకొని తిరుగు ప్రయాణం సాగిస్తున్నారు.

Share this post
Exit mobile version