Site icon MANATELANGANAA

కౌండిన్య పరపతి సంఘం ఆధ్వర్యంలో గౌడ కౌన్సిలర్లకు సన్మానం

ప్రజాభిమానం చూరగోనే విధంగా కౌన్సిలరులు పని చేయాలి: కుర్రెముల యాదగిరి గౌడ్

కౌండిన్య పరపతి సంఘం ఆధ్వర్యంలో గౌడ కౌన్సిలర్లకు సన్మానం
జనగామ మార్చి 6:
ఇటీవల జరిగిన జనగామ మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన నలుగురు కౌన్సిలర్లకు కౌండిన్య పరపతి సంఘం జనగామ ఆధ్వర్యంలో మూడవ వార్డులోని మాధవి నిలయంలో (గురువారం రాత్రి) మార్చి 5 న ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు.

సన్మాన పొందిన 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి, 9వ వార్డు కౌన్సిలర్ గునిగంటి వెన్నెల రామకృష్ణ 18వ వార్డు కౌన్సిలర్ గోపగోని సుగుణాకర్ 25వ వార్డు కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ పరపతి సంఘం పక్షాన మమ్మల్ని సన్మానించి ఆశీర్వదించిన గౌడ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీరు, మాకు ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ల ఆశయాల మేరకు పని చేయగలమని అన్నారు.
సభాధ్యక్షులు, పరపతి సంఘం అధ్యక్షులు గోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రేముల యాదగిరి గౌడ్ తొలుత స్వాగతనుపలుకుతూ జనగామ మున్సిపల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మున్సిపల్ ఎన్నికలలో గౌడ సామాజిక వర్గానికి చెందిన నలుగురు కౌన్సిలర్లుగా గెలవడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. అలాగే మీ మీద ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మంచి సేవలు అందించి భవిష్యత్తులో గుర్తింపు పొందాలని సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో జనగామ మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కౌన్సిల్లో గొంతెత్తి పనిచేయాలి పనిచేయాలన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న జనగామ జిల్లా “గోపా” వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ కన్నా పరశురాములు గౌడ్ మాట్లాడుతూ గౌడులు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో ఎదగాలని అలాగే మన తోటి ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన వర్గాలను కలుపుకొని మరింత రాజకీయంగా ఎదగడం కోసం కృషి చేయాలని అలా చేసినప్పుడు మాత్రమే బహుజనులకు రాజ్యాధికార దిశగా అడుగులు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జనగామ పట్టణంలో అలాగే జిల్లా వ్యాప్తంగా మన గౌడ ప్రజాప్రతినిధులు పేద పిల్లల చదువుల విషయంలో యువతకు ఉపాధి కల్పించే విషయంలో ముందు వరసన నిలబడాలని కోరారు. జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా ప్రభుత్వం ప్రకటించిన దాన్ని గెజిట్ రూపకంగా ఆమోదింప చేయడం కోసం అందరూ కృషి చేయాలని దానికి అన్ని వర్గాలను కూడగట్టుకునే ప్రయత్నంతో ముందుకు పోవాలని అన్నారు.
ఈకార్యక్రమంలో కౌండిన్య పరపతి సంఘం ఉపాధ్యక్షుడు వి. విజయకుమార్, కార్యదర్శి అంబటి రాజయ్య, కోశాధికారి దూడల రమేష్, గోపా అధ్యక్షుడు మేకపోతుల ఆంజనేయులు కార్యదర్శి బైరగోని శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి దూడల రాజా సంపత్ గౌడ్, వార్డు ప్రముఖులు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, మాచర్ల ప్రభాకర్ గౌడ్, బాల్నే విద్యాసాగర్ గౌడ్ సుదగాని సంజీవ గౌడ్, సుధగాని కృష్ణ గౌడ్, మాచర్ల నర్సింహులు గౌడ్, గోపగోని ప్రభాకర్ గౌడ్,బత్తిని నరసింహులు గౌడ్,దూసరి ఉపేందర్ గౌడ్ గూడ రాజా బోస్ గౌడ్,మచ్చ ప్రవీణ్ గౌడ్, బూడిది సుధాకర్ గౌడ్,బూడిది రవీందర్ గౌడ్, రంగు లక్ష్మణ్ గౌడ్, పాముకుంట్ల మధు గౌడ్, సుధాకర్ గౌడ్ ధూపటి సోమయ్య గౌడ్ అంబటి అంజయ్య గౌడ బుడిగే కృష్ణమూర్తి గౌడ్, నగేష్ గౌడ్, మాధవి, అలివేలు మంగ తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version