Site icon MANATELANGANAA

మున్సిపల్ లో పార్టీల పల్స్ – ధీమాలో కాంగ్రేస్

muncipolls

ప్రచారం ముగిసి బధవారం పోలింగ్ జరిగే నాటికి సర్వేలు బయటికి వచ్చాయి. టివి చానెల్స్ కొన్ని వెల్లడించిన సర్వే ఫలితాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు అన్ని మున్సిపాల్టీలలో అధికార కాంగ్రేస్  పార్టీకి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.

దాంతో కాంగ్రేస్ పార్టి గెలపుపై ధీమాతో ఉంది. మెజార్టి కౌన్సిలర్లు గెలవనున్నారని ఇతర సర్వేలలో కూడ కాంగ్రేస్ పార్టీకే ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని వార్తలు వచ్చాయి.

ప్రభుత్వ నిఘావర్గాల నివేదికలలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రేస్ కు మంచి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే టఫ్ ఫైట్ ఉన్న చోట కాంగ్రేస్ పార్టీకి గెలుపు అంతఈజీగా లెదని పోలీసు ఇంటలిజెన్సు వర్గాల నివేదికలకు తోడు స్వంత సర్వేలలో కూడ వెల్లడైనట్లు సమాచారం. దాంతో కాంగ్రేస్ పార్టి అగ్ర నాయకులు స్థానిక నాయకులకు ముందే హెచ్చరికలు జారిచేసినట్లు చెబుతున్నారు.

ఏం చేస్తారో తెలియదు గెలిపించుకు రావాలని గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.

హోరా హోరీగా  ఉన్న భూపాల్ పల్లి,వర్దన్నపేట,పరకాల మున్సిపాల్టీలలో కాంగ్రేస్ ఎదురీదే పరిస్థుతులు ఉన్నా అన్ని విధాలా గెలుపు కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. జనగామలో బిఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

తొర్రూరు మున్సిపాల్టీలో కాంగ్రేస్,బిఆర్ఎస్ మద్య హోరా  హోరి ఉంది. మహబూబాబాద్,ములుగు,కేసముద్రం,స్టేషన్ ఘన్ పూర్, మున్సిపాల్టీలలో కాంగ్రేస్ పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సర్వేలు ఎలాఉన్నా పోలింగ్ రోజు నాటికి అభ్యర్థుల పోల్ మేనేజ్ మెంట్ మేరకు కూడ అఖరి క్షణాల్లో  పరిస్థితులు మారే అవకాశాలు లేకపోలేదు.

పార్టి గుర్తులపై దరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులందరి జాతకాలు బయట పడనున్నాయి.

టీపీసీసీ మున్సిపల్ ఎన్నికల మానిటరింగ్ కమిటీ ఛైర్మన్ మృత్యుంజయం ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీవే. సర్వేలు, ప్రజల్లో ఉన్న మద్దతు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, వెల్ఫేర్ స్కీమ్‌లు మా విజయానికి బలం చేకూరుస్తున్నాయి” అని పేర్కొన్నారు.

మంత్రి దామోదర్ రాజనరసింహ “75 నుంచి 80 శాతం స్థానాలు కాంగ్రెస్ గెలుస్తాయి” అని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు ప్రజల మనసు గెలిచాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఏకగ్రీవ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం, మొత్తం 14 వార్డులు/డివిజన్లు ఏకగ్రీవంగా గెలిచాయి. వీటిలో 12 కాంగ్రెస్ అభ్యర్థులకు, 2 మాత్రమే బీఆర్ఎస్‌కు దక్కాయి. ఇది కాంగ్రెస్‌కు బలమైన సంకేతంగా చెబుతున్నారు.

ఎన్నికల వివరాలు

కాంగ్రెస్ నాయకులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పట్టణాల్లో కూడా పునరావృతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా బలంగా పోటీ చేస్తున్నప్పటికీ, కాంగ్రెస్ అధికారంలో ఉండటం, వెల్ఫేర్ స్కీమ్‌లు ఇవి మెజారిటీ స్థానాలు దక్కించుకునేలా చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Share this post
Exit mobile version