Site icon MANATELANGANAA

మేడారం దేవాలయం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.


ఎస్.ఎస్. తాడ్వాయి మండలం, 11,డిసెంబర్, 2025:

మేడారం దేవాలయం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను పరిశీలించిన…
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.


మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు.

గురువారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అదనపు లేబర్ ను ఉపయోగించుకొని 24 గంటలు షిఫ్ట్ ల వారిగా పనులు చేయాలని, నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి, ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version