Site icon MANATELANGANAA

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన MLA నాయిని రాజేందర్ రెడ్డి

బాలసముద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
81 మంది లబ్ధిదారులకు రూ.25.86 లక్షల విలువైన చెక్కులు అందజేసిన MLA

హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి 81 మంది అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.25,86,500 విలువైన చెక్కులను స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తూ అవసరమైన వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని తెలిపారు.

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రాజకీయాలు, పార్టీ భేదాలు అడ్డుకావని, సహాయం కోరిన ప్రతి అర్హుడికి సీఎం సహాయనిధి అందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

గత పాలకుల కాలంలో సహాయ నిధుల కోసం దళారీ వ్యవస్థ రాజ్యమేలిందని, చెక్కులు పొందాలంటే ప్రజలు డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితికి పూర్తిగా తెరదించామని, ఎవరికీ నయా పైసా ఖర్చు లేకుండా నేరుగా లబ్ధిదారుల చేతుల్లోకి చెక్కులు చేరేలా ప్రక్రియను సులభతరం చేశామని తెలిపారు.

ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని వేగంగా పరిష్కారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అర్హులందరికి రాలేదనకుండా సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, వేముల వాసు, చీకటి శారదా ఆనంద్, నాయకులు,అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version