Site icon MANATELANGANAA

కలెక్టర్లకు కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేసారు .

కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి Revanth Reddy తో పాటు రాష్ట్ర మంత్రులు Uttam Kumar Reddy, Ponguleti Srinivas Reddy, Damodar Rajanarsimha, Komatireddy Venkat Reddy, Ponnam Prabhakar, Duddilla Sridhar Babu, Vakiti Srihari, Jupally Krishna Rao, Konda Surekha, **Seethakka**తో పాటు ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.


సమావేశంలో “99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమానికి సంబంధించిన ప్రధాన అంశాలను ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులందరికీ చేరేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
గ్రామ సభల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
అదేవిధంగా విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలపై ప్రజలకు అవగాహన పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి సమీప మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 99 రోజుల ప్రణాళికలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Share this post
Exit mobile version