Site icon MANATELANGANAA

కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సిఎం ప్రత్యేకపూజలు

cm revanth reddy

నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో శ్రీ. ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం, రైతులు సుభిక్షంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి వెనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి తనాసరి అనసూయ (సీతక్క), ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి శ్రీధర్ బాబు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, ఎమ్మెల్సీ లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version