Site icon MANATELANGANAA

తిరుపతిలో కేర్ టేకర్ దారుణం – 8 గ్రాముల బంగారం కోసం హత్య

cretker

తిరుపతి (రేణిగుంట)
అందరూ తెల్సుకోవాల్సిన సంఘటన ఇది. ఇండ్లల్లో వయోభారంతో అనారోగ్యం పాలైన పెద్దల భాగోగులు చూసుకునేందుకు వేలకువేలు ఇచ్చి కేర్ టేకర్స్ ను నియమించుకోవడం సర్వ సాధారణంగా మారింది. ఈకేర్ టేకర్స్ ముందు బాగానే ఉన్నట్లు నటించి ఆతర్వాత తమ దుర్భిద్ది ప్రదర్శించి నేరాలకు పాల్పడుతున్నారు.

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇలాంటి భాదాకర ఘటన చోటు చేసుకుంది. నమ్మకంగా ఇంట్లో నియమించుకున్న కేర్ టేకరే దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలు దొంగిలించి ఫరారయ్యాడు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రేణిగుంట రోడ్డులోని సీపీఐర్ విల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శివ ఆనంద్ తన తండ్రి శణ్ముగం (పక్షవాతం బాధితుడు), మేనత్త ధనలక్ష్మితో కలిసి నివసిస్తున్నాడు. తన తండ్రిని చూసుకునేందుకు రవి అనే వ్యక్తిని కేర్ టేకర్‌గా నియమించాడు.

మొదట ఏజెన్సీ ద్వారా నెలకు రూ.25 వేలు చెల్లించగా, తరువాత నేరుగా రవితో మాట్లాడి రూ.22 వేలకే ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొన్ని నెలలు బాగానే ఉన్న రవి… తర్వాత అసలు స్వరూపం బయటపెట్టాడు.

శివ ఆనంద్ ఇటీవల హైదరాబాద్‌లో మీటింగ్ కోసం వెళ్ళాల్సి రావడంతో, కేర్ టేకర్‌కి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. ఇదే అవకాశంగా భావించిన రవి, ఇంట్లో నిద్రిస్తున్న మేనత్త ధనలక్ష్మిపై దాడి చేసి, ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఆమె చెవుల్లో ఉన్న 8 గ్రాముల బంగారు కమ్మలు దోచుకుని పరారయ్యాడు.

ఎలా బయటపడింది?

శివ ఆనంద్ ఎన్నిసార్లు రవికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం కలిగింది. పొరుగువారు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి, ధనలక్ష్మి విగతజీవిగా పడి ఉంది. వెంటనే ఈ విషయాన్ని శివ ఆనంద్‌కి సమాచారం ఇచ్చారు.

ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, రవి చేసిన దారుణం స్పష్టంగా రికార్డు అయ్యింది.

వెంటనే శివ ఆనంద్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రవిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు.

Share this post
Exit mobile version