Site icon MANATELANGANAA

లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

• భవన అనుమతి, ఇంటి నంబర్ కోసం రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన కార్యదర్శి.
• ముదిగొండలో వలపన్ని పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


ఖమ్మం, జూన్ 27: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని భానాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ రూ.25 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం, భానాపురం గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడు నిర్మిస్తున్న ఒక గది రేకుల ఇంటికి భవన నిర్మాణ అనుమతి మంజూరు చేయడం, ఇంటి నంబర్ కేటాయించడం కోసం పంచాయతీ కార్యదర్శి రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు ముదిగొండ రైతు వేదిక సమీపంలో ఉచ్చుపన్ని, సురేష్ లంచం స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.25 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని అరెస్టు చేసి వరంగల్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు. కేసు దర్యాప్తులో ఉంది.

Share this post
Exit mobile version