Site icon MANATELANGANAA

తెలంగాణ తొలిదశ నుండి తుది పోరు వరకు… పులి సారంగపాణి

వరంగల్ కు చెందిన పులిసారంగ పాణి తెలంగాణ తొలితరం ఉద్యమ నేత…

తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలని నిర్విరామంగా తొలి మలి దశ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని దిశా నిర్దేశం చేసిన నాయకుడు.

ఇడ్లి సాంబర్ గోబ్యాక్ నుండి 1969వరకు ఉద్యమంలో చిన్న వయస్సులోనే తెలంగాణ కావాలని తెగించి కొట్లాడిన వ్యక్తి.

ఇవన్ని ఇప్పుడు చెప్పే కన్నా ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడ ఆనాడు తెలంగాణలో చనిపోలేదు. అధికారబలంతో తెలంగాణ వారిని అణిచి వేసారని పులిసారంగ పాణి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన రోజు చాలా సంతోషం కలిగిందని అన్నారు.

ప్రత్యేక తెలంగాణరాష్ర్టం చూస్తానని అనుకోలేదని కాని విద్యార్థులు యువకులు చేసిన త్యాగాల ఫలితంగా ఎన్నికుట్రలు కుతంత్రాలు జరిగినా ప్రజలు తెగించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నారన్నారు.

తెలంగాణ విజయం తెలంగాణ ప్రజలకే చెందుతుందని ఎవరో ఒకరు క్రెడిబిలిటీ క్లెయిమ్ చేసుకోవడం సరికాదని అన్నారు.

సంవత్సరాల తరబడి కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది యువకులు తమవిలువైన జీవితాలను కోల్పోయారని అన్నారు.

కుటుంబాలకు కుటుంబాలు అనేకం దిక్కూ దీవానం లేకుండా అగమయ్యాయని అన్నారు.

1969 లో 369 మందిని పిట్టలను కాల్పిచంపినట్లు కాల్చిచంపారని తుది దశ ఉద్యమంలో వందలాది మంది బలిదాణాలు చేసారని అన్నారు.

ప్రజల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని అన్నారు.

ప్రజల్లో ధృడమైన ఆకాంక్ష లేకుంటే తెలంగాణ వచ్చేదికాదన్నారు. రాజకీయ పార్టీలు,నాయకులు అనివార్యంగానే ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణనినాదం ఎత్తుకోక తప్ప లేదని అన్నారు. కెసిఆర్ తో సహా ఎవరైనా తెలంగాణ క్రెడిబులిటీ తనకే దక్కుతుందని క్లెయిమ్ చేసుకోవడం తగదని అభిప్రాయపడ్డారు.

గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన చెన్నారెడ్డితో పోల్చితే కెసిఆర్ నాయకుడిగా సమర్దవంతంగా ఉద్యమం వెంటనిలిచారని అన్నారు. గతచేదు అనుభవాల కారణంగా తాను చాలా రోజుల వరకు మలివిడతఉద్యమంలో సంశయంలో ఉండిపోయానని కాని ప్రజలపోరాట స్పూర్తి చూసిఉద్యోగ సంఘ జేఏసినేతగా ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం అద్యక్షులుగా ఉద్యమంలో పనిచేసానని అన్నారు. తెలంగాణ రాష్ర్టం ఎందుకు అవసరమో ఈప్రాంతానికి జరిగిన నష్టం ఏమిటో వివరిస్తూ శ్రీకృష్ణ కమిటీకి నివేదికఇచ్చానని తెలిపారు.

1969 ఉద్యమ సమయంలో వరంగల్ లోని చందాకాంతయ్య మెమోరియల్ కాలేజివిద్యార్థి సంఘం అధ్యక్షులుగా ఉన్నానని చెప్పాడు.

అప్పట్లో మదీనా కేఫ్ అడ్డాగా లక్ష్మి టాకీస్ ఏరియాలో తమఉద్యమ వ్యూహరచనలు సాగేవని తెలిపారు.

తొలి దశలోతనతోపాటు పనిచేసిన ఉద్యమ కారుల్లోఒకరిద్దరు తప్పు మిగతా వారు చనిపోయారని అన్నారు. తనతోపాటు సిద్దులు ఉన్నాడని భద్రాచలం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గాపనిచేసి రిటైర్ అయ్యారని ఇంకా సురేందర్ రెడ్డి, అమరేందర్, హయ గ్రీవాచారి అల్లుడు వరదాచారి చనిపోయారని అన్నారు.

తెలంగాణ రాష్ర్టంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్య ఇప్పటికి తీరలేదని అన్నారు.

“రాష్ర్టం ఏర్పడి12 సంవత్సరాలు కావస్తోంది…10 ఏండ్ల కెసిఆర్ పాలన తర్వాత ప్రభుత్వం మారింది. నాయకులు పార్టీలు జానాకర్షక పథకాలతో ప్రజలను మభ్య పెట్టే విధానాలు అనుసరించడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని” అన్నారు.

ఉచిత పథకాలు కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వనరులఅభివృద్ది జరగాలని అన్నారు. అందుకోసం పాలకుల్లో చిత్తశుద్ది అవసరమని పేర్కొన్నారు. ఉచిత విద్య,ఉచిత వైద్యానికి ప్రాధాన్యత నివ్వాలని అన్నారు.

నేపాల్ తోసహా అనేక ప్రాశ్చాత్య దేశాలలో ఉచిత విద్య అమలు అవుతోందని అన్నారు.ఇక్కడి యువత ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఇక్కడే వారి భవిష్యత్ కు ఉపక్రమించేలా అభివృద్ది జరిగి భరోసా ఏర్పడాలని అన్నారు.

తెలంగాణ కోసం తొలి దశ మలిదశలో త్యాగాలు చేసిన వారి కుటుంబాలకు ప్రభుత్వం సంపూర్ణంగా అండగా నిలవాలని అన్నారు. ఐదు వందలో వెయ్యో రెండు వేలో ఇచ్చి చేతులు దులుపు కోకుండా తెలంగాణ ఉద్యమకారలను సంపూర్ణంగా ఆదుకోవాలని అన్నారు.

పార్టీలు,నాయకులు ఓట్ల రాజకీయాలు మానుకోవాలని ప్రజలు కూడ ఆదిశగా పార్టీలకు కనువిప్పు కలిగేలా చైతన్య వంతులు కావాలని అన్నారు. ప్రజలే పాలకులకు గుణపాఠాలు నేర్పించాలని అన్నారు. ఇంకా సీమాంధ్ర నాయకులకు బానిసలుగా పనిచేసే అలవాటు కొందరు తెలంగాణ నేతలకు పోలేదని అన్నారు.ఇదిఎప్పటికైనా తెలంగాణాకు ప్రమాదమేనని హెచ్చరించారు. నిరంతరం అప్రమత్తంగా లేకపోతే ఆంధ్రప్రాంతం నేతలతో తెలంగాణ ప్రాంత అస్తిత్వానికిముప్పు తప్పదని అన్నారు.

రాజకీయాలలో కొత్తతరం నాయకత్వం ఎదగాలని అన్నారు. విద్యావేత్తలను మేధావులను ప్రజలు గౌరవించాలని అన్నారు. సామాజిక తెలంగాణ ప్రజా స్వామిక తెలంగాణ రావాలని

తెలంగాణలో సబ్బండ వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలని ఒకటిరెండు కులాల ఆధిపత్యం పోవాలని అందరికి రాజకీయాధికారంలో వాటా దక్కాలని అన్నారు.

Share this post
Exit mobile version