Site icon MANATELANGANAA

ఏసీబీ ట్రాప్ లో ఆర్మూర్ ఎంవిఐ

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మోటారు వాహన ఇన్స్పెక్టరు గుర్రం వివేకానంద రెడ్డి, అతని వ్యక్తిగత డ్రైవర్ తిరుపతితో కలిసి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

ఫిర్యాదు దారుని వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్‌ల పునరుద్ధరణ, లెర్నింగ్ లైసెన్స్‌ల జారీ వంటి సేవలకు సంబంధించి ఎలాంటి పనులు పెండింగ్‌లో ఉంచకుండా చూడాలని చెప్పి, రూ.25,000 లంచం తీసుకుంటున్న సమయంలో అనిశా అధికారులు ఆకస్మిక దాడి చేసి వీరిని అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయవచ్చు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు.

Share this post
Exit mobile version