అంపశయ్య నవీన్,అంతడుపల రమాదేవి లకు పొన్నం సత్తయ్య జీవితసాపల్య పురస్కారం
ఈ నెల 13 న రవీంద్ర భారతిలో ప్రధానం
మంత్రి పొన్నం ప్రభాకర్ గారి తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఏటా రచయితలకు, కళాకారులకు అందించే పొన్నం సత్తయ్య జీవితసాపల్య పురస్కారాలకు ఈ ఏడాది సాహిత్యం విభాగంలో ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్, కళారంగంలో అంతడుపల రమాదేవి లు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఎంపిక కమిటీ కన్వీనర్ డా.పొన్నం రవిచంద్ర సారధ్యంలో జ్యూరీ కమిటీలో సీనియర్ పాత్రికేయులు కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ,సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ , రచయిత్రి అయినంపూడి శ్రీ లక్ష్మీ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ వార్డులను ఎంపిక చేసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎంపిక పత్రాన్ని అందచేసారు. గత మూడు సంవత్సరాలు ఈ అవార్డులను సాహిత్య విభాగంలో నాళేశ్వరం శంకరం, నలిమెలా భాస్కర్, చంద్రబోస్ లు అందుకోగా కళాకారుల విభాగంలో ఒగ్గు ధర్మయ్య, కామ్రేడ్ విమలక్క, బలగం ఫేమ్ కొమురమ్మ అందుకున్నారు.
ఈ సంవత్సరం కమిటీ పలువురు రచయితలు , కళాకారుల పేర్లను పరిశీలించి అంపశయ్య నవీన్, అంతడుపుల రమాదేవి పేర్లను ఎంపిక చేశారు.