రంగారెడ్డి జిల్లా, తెలంగాణ:
ఆమనగల్ మండల తహశీల్దారు చింతకింది లలిత, మండల సర్వేయర్ కోట రవి, ప్రజల నుండి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడి అమ్మమ్మ గారికి సంబంధించిన భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు భూ రికార్డులలోని ముద్రణా లోపాలను సరిదిద్దడం కోసం అధికారులు మొత్తం రూ.1,00,000 లంచం డిమాండ్ చేశారు. అందులో ఇప్పటికే రూ.50,000 తీసుకున్నారు. మిగిలిన రూ.50,000 స్వీకరిస్తూ ఉండగా, ACB అధికారులు వారిని పట్టుకున్నారు.
ప్రజలు ప్రభుత్వ సేవకులు లంచం కోరిన సందర్భాల్లో టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయవచ్చని ACB తెలిపింది. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు అందించవచ్చని సూచించింది.
ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ACB హామీ ఇచ్చింది
ఆమనగల్ తహశీల్దారు – మండల సర్వేయర్ లంచం తీసుకుంటూ ఎ సి బి కి దొరికారు
