Site icon MANATELANGANAA

హనుమకొండలో న్యాయవాదుల నిరసన

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను భర్త్ రఫ్ చేయాలి

విద్యార్థులపై దాడి దుర్మార్గం

హనుమకొండలో న్యాయవాదుల నిరసన

బిజెపి పాలనపై నిరసిస్తూ ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేస్తున్న దేశ విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసుల దాడిని ఖండిస్తూ హన్మకొండలో అదాలత్ సెంటర్‌ అమరవీరుల స్తూపం వద్ద బుధవారం న్యాయవాదులు నిరసన చేసారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు బైరపాక జయాకర్, పులిసత్యనారాయణ, సాయిని నరేందర్, గంధం శివ, దాక్టర్ జిలుకర శ్రీనివాస్, వలీ ఉల్లా కాద్రీ మాట్లాడారు.

మాజీ బార్ కౌన్సిల్ సభ్యులు బైరపాక జయాకర్ మాట్లాడుతూ విద్యార్థులు శాంతియుత నిరసన చేస్తే మోడీ ప్రభుత్వం పోలీసులతో విచక్షణారహితంగా దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. నీట్ పేపర్ లేకేజికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాది పులి సత్యనారాయణ మాట్లాడుతూ గత నెల రోజులుగా పోరాడుతున్న విద్యార్థులను తీవ్రవాదులుగా, దేశ ద్రోహులుగా ముద్రవేసి దారుణంగా దాడులు చేయడం సహించరాని నేరమని అన్నారు. దేశంలోని న్యాయవాదులంతా విద్యార్థులకు మద్దతుగా వుండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని, విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని గంధం శివ డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో పాల్గొన్న ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ నిరాహర దీక్ష చేస్తున్న వాంగ్ చుక్, నిరసన చేస్తున్న విద్యార్థులతో బేషరతుగా నరేంద్ర మోడీ, అమితాషాలు చర్చలు జరపాలని, పరీక్ష పత్రాల లీకుకు బాధ్యత వహించి ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ ప్రవేషాల కోసం నిర్వహించే నీట్ ను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకే మెడికల్ సీట్ల భర్తీ హక్కులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర పెత్తనం వల్లనే పేపర్లు లేకులు అయి విద్యార్థుల భవిషత్తుతో చలగాటం ఆడుతున్నారని అన్నారు. పేపర్ లీక్ కు బాధ్యతగా కేంద్ర విద్యా శాఖ మంత్రి, విద్యార్థులపై దాడికి బాధ్యతగా నరేంద్ర మోడీ, అమిత్ షా లు రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమాన్ని వి సి కె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది దాక్టర్ జిలుకర శ్రీనివాస్ సమన్వయం చేయగా, న్యాయవాదులు వలీ ఉల్లా ఖాద్రీ, కూనూరు రంజిత్ గౌడ్, ఇజ్జగిరి సురేష్, పెండ్యాల అనిల్ కుమార్, సన్నీ, గోదా బిక్షపతి, ఎగ్గడి సుందర్ రామ్, సాయి పవన్, బి ఎస్ పాణి, రాజబాపు, యోగీ రావణ్, బరుపటి వినయ్ కుమార్, డాక్టర్ కొంగ వీరాస్వామి, కుమార్, యుగేందర్, అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version