భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉల్లోజు నర్సింహారావు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కారు.
పట్టణంలో ఓ ఎరువుల వ్యాపారి సరైన ఇన్వాయిసులు లేకుండా యూరియా బాగులు విక్రయించినట్లు ఏడీకి ఫిర్యాదు అందింది. విచారణ కు వెళ్లిన ఏడి షాపు రికార్డులు తనిఖీ చేసారు. ఇన్వాయిసులు లేకుండా జీరో వ్యాపారం చేసాడని కేసు నమోదు చేయాలని బెదిరించాడు. షాపు యజమాని బ్రతిమిలాడితే కేసు లేకుండా చూసేందుకు ఆయన నుండి రూ.25,000 లంచం డిమాండ్ చేసాడు. భాదితుడు ఏసీబీ అధికారులను అశ్రాయించాడు.
అధికారి లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ప్రజలకు ఒక ముఖ్యమైన సూచనగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన పక్షంలో వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు తెలిపారు. అందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేయవచ్చు. అదేవిధంగా
- వాట్సాప్: 9440446106
- ఫేస్బుక్: Telangana ACB
- ఎక్స్ (Twitter): @TelanganaACB
- వెబ్సైట్: acb.telangana.gov.in
మార్గాల ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచబడుతాయని అధికారులు హామీ ఇచ్చారు.