తెలంగాణలో రెండు వేర్వేరు లంచం కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.
తెలంగాణలో రెండు వేర్వేరు చోట్ల అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు లంచం స్వీకరిస్తున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
నల్లగొండ జిల్లా చండూరు మండలంలో డిప్యూటీ తహసీల్దార్ చంద్ర శేఖర్ ఫిర్యాదుదారుని తండ్రికి చెందిన భూమికి సంబంధించి గతంలో జారీ చేసిన మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ మరియు సంబంధిత పత్రాలను ఇవ్వడానికి రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
ఇక హనుమకొండలో అదనపు కలెక్టర్ మరియు జిల్లా ఇన్‌ఛార్జ్ విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో రూ.60,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
వెంకట్ రెడ్డి తో పాటు గౌస్, మనోజ్ జూనియర్ అసిస్టెంట్లను కూడ పట్టుకుని విచారిస్తున్నారు.
ప్రభుత్వ సేవకులు ఎవరైనా లంచం కోరిన పక్షంలో ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుల కోసం అందుబాటులో ఉన్న వివరాలు:
• టోల్ ఫ్రీ నంబర్: 1064
• WhatsApp: 9440446106
• Facebook: Telangana ACB
• X (Twitter): @TelanganaACB
• Website: acb.telangana.gov.in
ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ భరోసా ఇచ్చింది.

