భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్ ఐ లంచం కేసులో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసారు. సబ్–ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బత్తిని రంజిత్ ఓ కేసులో నిందితులకు సహకరించేందుకు 40 వేల లంచం డిమాండ్ చేసాడు.
ఫిర్యాదుదారుడు అతని సోదరుడిపై నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా నోటీసు జారీ చేయాలంటే రూ.40,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో భాదితుడు ఏసీబీ ని అశ్రయించాడు.
భాదితులు సెప్టెంబర్ 19 న లంచం ఇచ్చేందుకు వెళ్లగా ఎస్ ఐ కి అనుమానం వచ్చి వారి నుండి డబ్బులు తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో ఆడియో, వీడియో ఆధారాలున్నాయని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఎస్‌ఐ ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రిమాండు కు తరలించారు.
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరినా వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.