Site icon MANATELANGANAA

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్‌ అధికారి రాధాకృష్ణా రెడ్డి

acb case

మేడ్చల్‌ జిల్లా ఎల్లంపేట మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి (ACB) పట్టుబడ్డాడు.

ఓ రియల్టర్ వెంచర్‌కు అనుమతి ఇచ్చేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు.
ఇప్పటికే రియల్టర్ నుండి రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్న రాధాకృష్ణ మరోవిడతగా శనివారం రోజున రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. రాధాకష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సోదాలలో అక్రమాస్థులు వెలుగుచూసాయి. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్ చేసారు.

ACB కి దొరికిన కన్నెపల్లి టెక్నికల్ అసిస్టెంట్
మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండల పరిషత్తు అభివృద్ధి అధికారి కార్యాలయంలోని పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి విభాగం లోని టెక్నికల్ అసిస్టెంట్-బానోత్ దుర్గా ప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

“ఫిర్యాదుధారునికి సంబంధించి MGNREGS కింద నిర్మించిన పశువుల కొట్టానికి సంబంధించిన కొలతలను కొలతల పుస్తకంలో నమోదు చేయడానికి మరియు పెండింగ్ బిల్లును మంజూరు చేయడానికి అధికారిక సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.10,000/- #లంచం డిమాండ్ చేసాడని ఎసిబి అధికారులు తెలిపారు.

Share this post
Exit mobile version