లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్
ఫిర్యాదుదారుడి తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని ఫిర్యాదుదారుడి పేరుపై మార్చేందుకు అనుకూలంగా నివేదిక పంపిస్తానని చెప్పి రూ.50,000 లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండల తహసీల్దారు యార్లగడ్డ శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తి చిన్నూరి అజయ్ ద్వారా తీసుకుంటున్న సమయంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ/ఏనిశా) అధికారులు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు అధికారులు ముందస్తు ప్రణాళికతో వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

