Site icon MANATELANGANAA

లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అటవీ శాఖ, మత్స్య శాఖ అధికారులు

అటవీ శాఖ అధికారులు, మత్స్య శాఖ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

పరిగి రేంజ్ అటవీ ప్రాంతం నుండి బాటసింగారంలోని పండ్ల మార్కెట్‌కు సీతాఫలాలను రవాణా చేయడానికి ఫిర్యాదుదారుని వాహనాలకు కాలానుగుణంగా ఆన్‌లైన్ ట్రాన్సిట్ పర్మిట్‌లను జారీ చేయడానికి”  ఫిర్యాదుధారుని నుండి రూ.40,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లాలోని పరిగి అటవీ రేంజ్ కార్యాలయంలోని “అటవీ రేంజ్ అధికారి – బొల్లుమల్ల సాయికుమార్, అటవీ సెక్షన్ అధికారి – మొహమ్మద్ మొయినుద్దీన్ మరియు డ్రైవర్ (పొరుగు సేవలు) – బాలనగరం బాలకృష్ణ.”

వరంగల్‌లో లంచం కేసు లో – మత్స్యకార అధికారిణి, ఫీల్డ్ ఆఫీసర్


వరంగల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 84 మంది కొత్త సభ్యులను చేర్చుకునే దస్తావేజులు ప్రాసెస్ చేయడానికి, ఉత్తర్వులు జారీ చేయడానికి రూ.70,000 లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడ్డారు.
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మత్స్యకార శాఖ అధికారి అల్లు నాగమణి ఆమె కార్యాలయంలోని క్షేత్ర స్థాయి అధికారి (పొరుగు సేవలు) పెద్దబోయిన హరీష్ లంచం తీసుకుంటున్న సమయంలో దొరికిపోయారు.
ఈ ఘటనపై అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.


ప్ర: ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌ 1064 కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్‌ (@TelanganaACB) మరియు వెబ్‌సైట్‌ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

Share this post
Exit mobile version