కిట్స్ వరంగల్ వర్క్ షాప్



*కిట్స్ వరంగల్ లో *సీంలెస్ రీసెర్చ్ విత్ ఐ ఈ ఈ ఈ ఎక్స్ప్లోర్ యాక్సెసింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ అనే సాంకేతిక అంశం పై ఒక్క రోజు సదస్సు నిర్వహించారు.*

*నూతన పరిశోధనలకు ఈ జర్నల్స్ అవసరం* *తద్వారా వినూత్న సాంకేతిక ఆవిష్కరణలు వెల్లి విరుస్తాయి అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె అశోక రెడ్డి వెల్లడించారు.*

 కిట్స్ వరంగల్ కేంద్రీయ గ్రంధాలయం  *సీంలెస్ రీసెర్చ్ విత్ ఐ ఈ ఈ ఈ ఎక్స్ప్లోర్ యాక్సెసింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ* అనే అంశంపై ఒకరోజు సదస్సు  నిర్వహించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు నూతన సాంకేతిక అంశాలు పరిశోధనలకు ఈ జర్నల్స్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి అని నేటి సదస్సు ముఖ్య వక్త, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఐ ఈ ఈ ఈ ట్రైనింగ్ మేనేజర్ ఎం.ఎస్ శ్రీనివాస తెలిపారు.  

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించిఎం.ఎస్ శ్రీనివాస మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పరిశోధనలు, ప్రాజెక్టుల రూపకల్పన, లోతైన విషయపరిజ్ఞానం, ఉద్యోగ సాధనలో ఈ జర్నల్స్ తోడ్పడతాయని తెలిపారు. 

కళాశాల గ్రంథ పాలకుడు డాక్టర్ కే ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక అంశాలైన క్లౌడ్ కంప్యూటింగ్ ,మిషన్ లర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇట్లాగేన్సి అంశాలు నేర్చుకోవడంలో ఈ జర్నల్స్ దోహదపడతాయి అన్నారు. 

ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్ ప్రొఫెసర్ వేణుమాధవ్ మరియు లైబ్రరీ కమిటీ చైర్మన్ & ఈ సి ఈ విభాగపు సీనియర్ ప్రొఫెసర్ డా బి రమాదేవి, ఈ ఈ ఈ విభాగాధిపతి డాక్టర్ జి రాజేందర్ మరియు అధ్యాపకులుగా డాక్టర్ రాజశేఖర్, డా ప్రవీణ, లైబ్రరీ స్టాఫ్  డా ఎం అరుణ్ కుమార్, పి సుమలత, టి రాజు మరియు 150 మంది విద్యర్థినీ విద్యార్థులు కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ & పిఆర్ఓ డాక్టర్ ప్రభాకరా చారి పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు