*_ఇది పాతదే..నో వర్రీ..!_*
ఇది ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న ఒక భారతీయ డాక్టర్ స్వీయ అనుభవం.. మనమైతే హెచ్ఎంపివీ వైరస్ గురించి ఇప్పుడే కొత్తగా వింటున్నాం గాని ఆయన గత అక్టోబర్ నుంచి హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు చికిత్స చేస్తూ వస్తున్నారు. వేరే వాళ్ళ సంగతి ఎందుకు..స్వయంగా ఆయన సతీమణి అక్టోబర్ లోనే హెచ్ఎంపివీ వైరస్ బారిన పడ్డారు.ఈ వైరస్ గురించి ఆయన చెప్పిన మాటలను ఆయన భాషలోనే తెలుసుకుందాం..
ఆస్ట్రేలియాలో గత సెప్టెంబర్, అక్టోబర్,నవంబర్ నెలల్లోనే హెచ్ఎంపివీ వైరస్ కేసులను నేను చూశాను.. ఇంచుమించుగా ప్రతిరోజు వైరస్ బాధితులకు చికిత్స చేసిన అనంతరం దీపావళి కోసమని మా దంపతులం స్వదేశానికి వచ్చాం.నవంబర్ 24న తిరిగి ఆస్ట్రేలియా చేరుకున్నాం.అక్కడికి వెళ్ళగానే నా సతీమణిలో
Rhino virus లక్షణాలు కనిపించాయి.నాలో కూడా influenza లక్షణాలు గమనించాను.జ్వరం,దగ్గు, విపరీతమైన నీరసం .
Rhino virus.. influenza hmpv..ఈ మూడిటిని గమనిస్తే మూడింటిలో హెచ్ఎంపివీనే తక్కువ సమస్యాత్మకమైనది.అంతేకాక దీని తీవ్రత కూడా అంత బాధించేది కాదు.నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో హెచ్ఎంపివీ సార్స్ కోవిడ్ లక్షణాలు గల కొందరు వ్యక్తులు నా దగ్గరికి చికిత్స కోసం వచ్చారు. హెచ్ఎంపివీ వైరస్ పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన సమస్య కాదని నా ఉద్దేశం. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ రోగం బారిన పడకుండా ఉంటాం. ఒకవేళ పడినా నామమాత్రపు చికిత్సతో తేరుకోవచ్చు.నా ఉద్దేశంలో ఇదంతా కేవలం మీడియా సృష్టిస్తున్న కలకాలం మాత్రమే. కనుక హెచ్ఎంపివీ వైరస్ విషయంలో జనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. ఈ జాగ్రత్తల వలన మనల్ని మనం పరిరక్షించుకోవడమే గాక చుట్టూ ఉండే ప్రజల ఆరోగ్యాన్ని కూడా రక్షించిన వారమవుతాం.. అంతే..!
*_సురేష్..9948546286_
జర్నలిస్ట్
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box