సమాచార శాఖ సిబ్బందికి డిజిటల్ కెమెరాలు



ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పింంచేందుకు మంత్రి  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిజిటల్ కెమెరాలు అందచేశారు

 

హైదరాబాద్, జనవరి 07:: రాష్ట్ర ప్రభుత్వం  అమలు చేస్తున్న  వివిధ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పై  ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సమాచార శాఖ  క్షేత్ర స్థాయి ఉద్యోగుల కు నూతన టెక్నాలజీతో కూడిన ఫోటో కెమెరాలను మంత్రి అందచేశారు. 

రాష్ట్రంలో  జిల్లా, క్షేత్ర స్థాయి సిబ్బందికి నూతన కెమెరాలను అందచేయడం వలన ఎప్పటికప్పుడు కార్యక్రమ ఫోటో వార్తలు మీడియాకు సులువుగా అందించవచ్చునని కమిషనర్ డాక్టర్ హరీష్ తెలిపారు. అన్ని జిల్లా కార్యాలయాలకు, డివిజన్ స్థాయి సిబ్బందికి ఫోటో కెమెరాలను అందచేస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ఫోటో కెమెరాలు సిబ్బందికి ప్రయోజనకరంగా ఉంటాయని కమీషనర్ పేరొన్నారు. క్షేత్ర స్థాయిలో రాష్ట్ర మంత్రులు,పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో సమాచార శాఖ సిబ్బంది విరివిగా పాల్గొంటు ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారని కమీషనర్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ కమీషనర్ డా.హరీష్, అదనపు సంచాలకులు డి.ఎస్.జగన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

-------

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు