బీమా కోరేగావ్ యుద్ధ స్ఫూర్తితో బహుజన రాజ్యాన్ని స్థాపిద్ధాం
వి.సి.కె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్
ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్
వీరోచిత పోరాటం చేసిన భీమా కోరేగావ్ యుద్ధ చరిత్ర గురుంచి అవగాహన చేసుకొని కోరేగావ్ స్ఫూర్తితో, అంబేద్కర్ అందించిన ఓటు ఆయుధంతో బహుజన రాజ్యాన్ని స్థాపించాలని విముక్త చిరుతల కక్షి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ లు పిలుపునిచ్చారు. 207 వ శౌర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హన్మకొండ జిల్లా కేంద్రం కొత్తూరు కమ్యూనిటీ హాల్ లో తెలంగాణ జిల్లాల పూలే యువజన సంఘాల సమాఖ్య అద్యక్షులు తాడిశెట్టి క్రాంతి కుమార్ అధ్యక్షతన జరిగిన భీమా కోరేగావ్ యుద్ధం - చారిత్రక దృక్పథం పై నిర్వహించిన సదస్సు లో వారు పాల్గొని ప్రసంగించారు.
చరిత్ర తెలుసుకున్న వారే చరిత్రను సృష్టించగలరని అంబేద్కర్ చెప్పినట్లు దేశ నిజమైన చరిత్రను, బహుజన వీరుల వీరోచిత చరిత్రను తెలుసుకున్న నాడే భారతదేశంలో బహుజన రాజ్యం స్థాపించగలమని అన్నారు. బహుజన వీరుడు శివాజీ మహారాజ్, వారి వారసత్వ రాజులను కుట్ర పూరితంగా హతమార్చిన పీష్వా రాజ్యాంతో వీరోచిత పోరాటం చేసి విజయం సాధించిన చరిత్రను ఈ దేశ ప్రజలు తెలుకోవాలని అన్నారు. 1818 జనవరి 1 న సాధించిన ఈ విజయం రోజున దేశ ప్రజలు ప్రతి సంవత్సరం భీమా కోరేగావ్ వెళ్లి యుద్ధ వీరులకు నివాళులు అర్పిస్తారని, గత 200 ఏండ్లుగా దేశ వ్యాప్తంగా జనవరి 1 న శౌర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటారని అన్నారు. బ్రిటిష్ వారు సాధించిన అన్ని విజయాల్లో శూద్ర, అతిశూద్ర వీరుల పాత్ర కీలకమని అన్నారు. శివాజీ మహారాజ్, బీమా కోరేగావ్ వీరుల చరిత్రను ప్రజలకు తెలిపిన జ్యోతిరావు పూలే కు, ఆ యుద్ధ చరిత్ర స్ఫూర్తిని కొనసాగించిన బాబాసాహెబ్ అంబేద్కర్ లను దేశ ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆనాడు భౌతిక యుద్ధం చేయాక తప్పలేదని, నేడు అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంతో బహుజన రాజ్యాన్ని స్థాపించాలని అన్నారు.
దేశంలో ఏ పోరాటం జరిగినా అందులో శూద్ర ప్రజల త్యాగాలు ఉన్నాయని, దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏండ్లు దాటిన దేశ మూలవాసులకు న్యాయం జరగడం లేదని అన్నారు. దేశంలో వర్ణ వ్యవస్థ వల్లనే ఈ దేశం పరాయి పాలనకు గురైందని, శూద్రులు, అతిశూద్రులు విద్యకు, ఆస్తికి, అధికారానికి దూరమవడానికి కూడా వర్ణ వ్యవస్తేనని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి, రాజ్యాంగం వ్రాసుకొని, ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని చెపుతున్నా ఆనాటి పీష్వాల వారసులే నేటికీ పాలన కొనసాగిస్తున్నారని, దేశంలోని మెజార్టీ ప్రజలు ప్రజాస్వామిక బానిసత్వంలో కొనసాగుతున్నారని అన్నారు. శివాజీ, పూలే, నారాయణ గురు, పెరియార్, అంబేద్కర్ లాంటి మహానీయుల స్పూర్తితో నిజమైన చరిత్ర తెలుసుకొని బహుజనులు బానిసత్వం వీడి రాజ్యాధికారం చేపట్టాలని అన్నారు.
ఈ కార్య్రమంలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజ, కె యు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్ బాబు, బుద్ధిష్ట్ సొసైటీ కేంద్ర కమిటీ సభ్యులు మిద్ధేపాక ఎల్లయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ సాగంటి మంజుల, ఎం 21 నాయకులు సంజీవ్, ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్, బి.సి ఉద్యోగ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ బుసుగొండ ఓంకార్, వివిధ సంఘాల నాయకులు నలిగింటి చంద్రమౌళి, మల్లికార్జున్, నరహరి, సంగాల స్వరూప, ఫరీద, తాటికొండ సద్గుణ, మామిడి రాకేష్, కొండి కృష్ణ గౌడ్, జూకంటి రవీందర్, నలబోల సంజయ్, అనిశెట్టి సాయితేజ అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box