*_ఆయన తెలుగింటి చందమామ!_*
_______________________
నాగిరెడ్డి జయంతి
02.12.1912
************************
*నాగిరెడ్డి..*
ఆ మస్తిష్కంలో పుట్టిన
రంగుల వినోదం *_చందమామ.._*
అది పంచిన ఆహ్లాదం
_*విజయా*_ వారి వెన్నెల..
ఆ ఇంట పుట్టిన పేరు
_*గుండమ్మకథ..*_
ఆయన బ్యానర్..
అపురూపచిత్రాల జోనర్..
కళాఖండాల కంటైనర్..!
చిన్నప్పుడు చదివిన బళ్ళో..
రామాయణభారతాలు..
ఇతర పురాణాలే
పాఠ్యాంశాలు..
అవే ఆయన సినిమాల్లో
ముఖ్యాంశాలు..
నేర్పిన పాఠమే సృష్టించింది
*మాయాబజార్..*
నేర్చిన గుణపాఠమే
*అప్పు చేసి పప్పు కూడు*
తగదని..అయినా
హోదాలో తగ్గొద్దని..!
తనేమో వ్యాపార మేధావి
చక్రపాణితో చెలిమి
పూవుకు అబ్బిన తావి..
ఆ మైత్రి సృష్టించిన
ఆనందభైరవి..
_*పాతాళభైరవి..*_
ఆ బ్యానర్లో మెరిసిన *మిస్సమ్మ..* సావిత్రమ్మ...!
విజయా ఆస్పత్రుల్లో
జబ్బులు మాయం..
విజయా వారి సినిమాలు
నవ్వుల మయం..
అస్తమించిన చక్రపాణి..
మారిపోయింది బాణీ..
హిట్టు కొట్టని
రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్బు
విజయా బ్యానర్ కు పట్టేసింది మబ్బు..
మెరిసిన తారలు
వెలిగిన దొరలు..
అప్రతిహతంగా
విజయా వారి
విజయాల పరంపరలు..
అక్కడ చక్రపాణి
*జగదేకవీరుడైతే*
షావుకారు నాగిరెడ్డి
వెలిగిపోయిన *చందమామ!*
+++++++++++++++
*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box