*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం*
*తేదీ: 20.12.2024*
*మున్సిపాలిటీగా మారిన స్టేషన్ ఘనపూర్....*
*అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి శ్రీధర్ బాబు....*
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ....*
స్టేషన్ ఘనపూర్ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా స్టేషన్ ఘనపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అత్యధిక నిధులు తీసుకువచ్చి స్టేషన్ ఘనపూర్ రూపు రేఖలు మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అడిగిన వెంటనే కాదనకుండా నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధన్యవాదములు తెలిపారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box