కెమిస్ట్రీ అధ్యా పకురాలు శ్రీమతి కి డాక్టరేట్

 


*పి.హెచ్.డి . చైతన్య (డిమ్డ్ టు బి యూనివర్శిటీ) హైదరాబాద్ నుండి కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అయిన కూర్మ శ్రీమతికి ప్రదానం *


కుర్మ శ్రీమతి, కెమిస్ట్రీ ఫ్యాకల్టీకి చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్శిటీ) హైదరాబాద్ డాక్టరేట్ ప్రదానం చేసారు. శ్రీమతి తన వినూత్న పరిషధనను క్యాన్సర్ కణాల మందు లపై విజయ వంతం గా చేసినందుకు గను పిహెచ్‌డి డిగ్రీ ప్రధానం చేసినట్లు చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్శిటీ) హైదరాబాద్   రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. రవీందర్, చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్సిటీ)  తెలిపారు.


 రసాయన శాస్త్ర రిసెర్చ్ స్కాలర్ కె శ్రీమతి తన పిహెచ్‌డి థీసిస్ ని "క్వినాక్సాలిన్ యొక్క డిజైన్ మరియు సింథసిస్ లింక్డ్ ఫైవ్ మెంబర్డ్ హెటెరో సైకిల్స్ మరియు వాటి బయోలాజికల్ ఎవాల్యుయేషన్" పేరుతోసమర్పించారని తెలిపారు. ఆమె తన పరిశోధనను  *డా. బి. శ్రీనివాస్, ప్రొఫెసర్, ఆఫ్ కెమిస్ట్రీ విభాగం చైతన్య (డీమ్డ్ టు బి యూనివర్శిటీ) హైదరాబాద్ వారి పర్యవేక్షణలో కొన సాగించారు.



 మూడు క్యాన్సర్ కణ తంతువుల ను నిర్మూలించే మందుల అన్వేషణ లో వారి ఇన్విట్రో యాంటీ క్యాన్సర్ చర్య కోసం సమ్మేళనాలను సంశ్లేషణ చేశారు. కార్యాచరణ ఫలితాలు ప్రామాణిక ఔషధం ఎర్లోటినిబ్ కంటే ఈ నూతన సమ్మేళనాలు మరింత శక్తివంతమైన కార్యాచరణను చూపించాయని  తెలిపారు.


ఈ సందర్భంగా ఆమెకు పిహెచ్‌డి లభించడం పట్ల ప్రొఫెసర్ సుందర్ రామ్, ప్రొఫెసర్ క్రిస్టోఫర్ ప్రొఫెసర్ బి. శ్రీనివాస్, ప్రొఫెసర్ నర్సింహ, ప్రొఫెసర్ జగదీష్, ఆమె కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు