ఫోన్ పోతే..సి.ఇ. ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయండి-పోలీస్ కమీషనర్



*ఫోన్ పోతే..సి.ఇ. ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయండి*

*పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* 


సెల్ ఫోన్ యజమానులు తమ ఫోన్ పోగొట్టుకుంటే చింతించవద్దని... తక్షణమే సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు ఇవ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.

హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న సెల్ ఫోన్ల స్వాధీనంకు సంబందించి హనుమకొండ పోలీసుల ఆధ్వర్యంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కనుగొని  పోలీస్ స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల ను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతులమీదుగా సెల్ ఫోన్ యజమానులకు అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దొంగతనం కాని పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ సిసిఎస్ తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని. వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై  డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్ సి.ఇ.ఈ.ఆర్  పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సి.ఇ.ఐ. ఆర్ పోర్టల్ *(https://www.ceir.gov.in)* నందు బ్లాక్ చేసి, సంబందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ఈ సందర్బంగా హనుమకొండ  ఏసీపీ, ఇన్స్ స్పెక్టర్ సతీష్, హోమ్ గార్డ్ అశోక్ లను  పోలీస్ కమిషనర్ అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు