ఛత్తిస్ ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల ఏరివేత నిర్వి రామంగా కొన సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర బలగాలు అడవుల ను జల్లెడ పడుతూ గాలింపు జరిపి మావోయిస్టులను వెంటాడి చంపుతున్నాయి.
ఇందులో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ములుగు అడవుల్లో తుపాకుల మోతలు మోగాయి. ఏటూరునాగారం మండలం చెల్పాక అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.—ఆదివారం ఉదయం 05.30 గంటలు 01.102.2024) జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోగా వారిని గుర్తించి పేర్లు ప్రకటించారు.
తెలంగాణ గ్రేహౌండ్స్ కు మావోయిస్టులకు జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల వివరాలు...
1.కుర్సం మంగు @ భద్రు @ పాపన్న, 35 సంవత్సరాలు, గుత్తికోయ, n/o చెరమంగి (v) బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్. TSCM, సెక్రటరీ యెల్లందు – నర్సంపేట AC, AK-
47 రైఫిల్.
2. ఏగోళపు మల్లయ్య @ మధు, DVCM, S/o గట్టయ్య, వయస్సు: 43 సంవత్సరాలు, కులం: గౌడ్ (BC), N/o రాజాపూర్ (v), రామగిరి (m), పెద్దపల్లి జిల్లా, తెలంగాణ.
DVCM,
కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ AC, AK-47 రైఫిల్,
3. ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ACM, 22 సంవత్సరాలు, గుత్తికోయ, n/o తంబేల్బట్టి (v), ఉసూర్ (m), బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్. G3 రైఫిల్.
4. ముస్సాకి జమున, ACM, 23 సంవత్సరాలు, గుత్తికోయ, n/o పొరోవాడ (v), బైరామ్‌ఘర్
5. జైసింగ్, పార్టీ సభ్యుడు, వయస్సు: 25 సంవత్సరాలు, n/o ఇంద్రావతి ప్రాంతం, .303 రైఫిల్.
6.కిషోర్, పార్టీ సభ్యుడు, వయస్సు: 22 సంవత్సరాలు, n/o పాంపాడ్ (v), గంగులూరు PS, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్, ఇన్సాస్ రైఫిల్.
7.కామేష్, పార్టీ సభ్యుడు, వయస్సు: 23 సంవత్సరాలు, n/o మలంపెంట (v), ఉసూర్ PS, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్, SBBL గన్.
ఎన్కౌంటర్ పై పోలీసులు చెప్పిన కథనం మేరకు
తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టగా.. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగ్గా.. ఏడుగురు నక్సల్స్ మృతి చెందినట్లు ఆ తర్వాత ప్రకటించారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు ఉన్నట్లు గుర్తించారు.
కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి-ములుగు జిల్లాల సరిహద్దుల్లోని గుండాల, కరికగూడెం మండలాల పరిధిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో గ్రేహండ్స్ బలగాలు అడవిలో కూoబింగ్ చేపట్టగా... వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.
తెలంగాణలో చాలా కాలంగా మావోయిస్టుల కదలికలు అంతగా లేవనే చెప్పొచ్చు. పోలీసులు తెలంగాణ సరిహద్దుల్లోని అడవిని జల్లెడ పడుతుండటంతో వారి కదలికలు తగ్గాయి. అడపాదడపా ఎన్‌కౌంటర్లు జరిగినా.. ఈ స్థాయిలో మాత్రం మావోయిస్టులు హతం కాలేదు. సెప్టెంబర్‌లో ఆరుగురు, ప్రస్తుతం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందటం నక్సల్స్‌కు ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలను అలర్ట్ చేశారు. అనుమానస్పద వ్యక్తులు, మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు.
ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్ పూర్ – దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ దండకారణ్యం రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగరాజు అలియాస్ రామకృష్ణ అలియాస్ కమలేశ్ అలియాస్ విష్ణు హతమయ్యాడు. మెుత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 250కు పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box