రాసి కాదు వాసి ముఖ్యం- అర్థం లేని " మోహన " వాక్యం
ఉట్టికెక్కలేని వాడిని స్వర్గానికి నిచ్చన వేయమనట్టుగా ఉంది మోహన్ భగవత్ ప్రతి కుటుంబం ముగ్గురిని కనాలని ప్రజలకు ఇచ్చిన సూచన. ప్రజలు ఏమైనా కానీ, కానీ తమ ప్రభుత్వాలు అధికారాల్లో ఉండాలి అనే అటువంటి విధానాలు మొదటి నుండి దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.
45 సంవత్సరాల్లో అత్యధికమైనటువంటి నిరుద్యోగత ఉందని ఎన్నో గణంకాలు చెబుతున్నాయి. ఫ్రెంచ్ ఆర్థిక వేస్తా థామస్ పికెట్ మన దేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా ఉన్నాయని 100 సంవత్సరాల లెక్కలు తీసి ఆధారాలతో నిరూపించాడు.
దేశంలో 70 శాతం మహిళలు సరి అయిన ఆహారం లేక అనీమీయాతో బాధపడుతున్నారు. ఎత్తుకు తగ్గ బరువు లేక వయసుకు తగ్గ ఎత్తు లేక 30 నుండి 40% చిన్న పిల్లలు మన దేశంలో అత్యంత దరిద్రంలో మిడుకుతున్నారు
మహారాష్ట్రలో ఇతర రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ తమ యొక్క కార్యకర్తలతో బిజెపిని కి పట్టం కంటే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు కానీ ఆ ఎన్నుకున్న ప్రజలు యొక్క సంక్షేమం గురించి ఏమీ ఆలోచించటం లేదు.
దేశంలో ప్రతి బీద కుటుంబం ఆరోగ్య పై ఖర్చు పెట్టే ఖర్చులో 70% చేతిలో ఉండే పెట్టుకుంటున్నారు. ఆరోగ్య వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఏమన్నా అంటే మేము చాలా మెడికల్ కాలేజీలు స్థాపించామంటున్నారు హాస్పిటల్స్ పెట్టాం అంటున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నా ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయనేది నిరూపితమైన విషయం. ప్రభుత్వం ఏర్పర్చిన మెడికల్ కాలేజీల్లో ఆసుపత్రుల్లో సరియైన సిబ్బంది ఉండదు; ఉన్న సిబ్బందికి నిబద్ధత లేదు.
కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలు ప్రజలని చాలా ఘోరంగా దోచుకున్నాయి. అప్పుడు మరి ఆర్ఎస్ఎస్ ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయలేదు.
ఉన్న పిల్లల్ని ఎలా సాదుకోవాలి అని ప్రజలు బాధపడుతుంటే ఇంకొకరిని ఎక్కువ కనండి అనడం ద్వారా ఈ భారతీయ ప్రజల యొక్క సమస్యల గురించి ఏమాత్రం అవగాహన లేదని అర్థమవుతుంది.
వారి అండతో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం అంత సమర్థవంతమైనది సాహసోపేత నిర్ణయాలకు చిరునామా అని చెప్పుకునే విషయం నిజమైతే ఏ మతం వారు కూడా ఇద్దరు పిల్లలకి ఎక్కువ కనబడదు అని నిబంధన పెట్టి అమలు చేస్తే అప్పుడు హిందువుల జనాభా నిష్పత్తి తగ్గదు.
అతి తక్కువ ధరలకు ఆహారాన్ని పండించి రైతులు ధర్నా చేస్తే ఢిల్లీలో ఒక సంవత్సరములో వందల మంది చనిపోయిన కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఉన్న ప్రజల సమస్యలు ఎలా తీర్చాలో సలహాలు ఇవ్వకుండా, ఇంకా ఎక్కువ కనండి అని అనడం మన పాలకులకే కాదు వారికి సలహాలు ఇచ్చే మహానుభావులు కూడా దేశంలో ఉన్నటువంటి రియాలిటీకి ఎంత దూరంగా ఉన్నారో అర్థమవుతుంది.
ప్రభుత్వము కార్పొరేట్స్ ఇచ్చినటువంటి రాయితీల వల్ల గత పది సంవత్సరాలలో 12 నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు ఈ కంపెనీలకు ఆదా అయ్యాయని గణాంకాల ద్వారా తెలుస్తుంది.
దశాబ్దాల నుండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇండ్లు లేని వారికి ఇల్లు కట్టించి ఇచ్చేందుకు లక్షల కోట్లు ఖర్చు పెట్టాయి. అయినా ఇంకా ఇల్లు లేని వారు కోట్లల్లో ఉన్నారు. ఒకరిద్దరూ పిల్లలు ఉన్న 90% కుటుంబాలకు ఉన్న ఇండ్లు సరిపోవటం లేదు. అలాంటి వారిని ఇంకా ఒకరో ఇద్దరినో ఎక్కువ కనమని చెప్పడం హాస్యాస్పదం.
50 కోట్లకు పైన ఉన్నటువంటి యువతలో ఉన్నత విద్యాభ్యసించే వారి సంఖ్య 20% కూడా దాటలేదు. ఇంకా జనాభా పెంచుకోవాలనడం అర్థం లేదు. చదువుకున్న విద్యార్థులలో నైపుణ్యాల లేమి విపరీతంగా ఉంది. ఆస్ట్రేలియా అటువంటి దేశాలలో కాఫీ చేయాలన్న, వంట పని చేయాలన్న, ఏ ఇతర నైపుణ్య ఆధారిత పని చేయాలంటే ప్రభుత్వ సంస్థలలో గాని ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థల లో కానీ ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికెట్ పొందవలసినదే. కానీ మన దగ్గర పెద్దపెద్ద బిల్డింగులు కట్టేవారు సైతం ఎలాంటి సంస్థ గత ట్రైనింగ్ తీసుకొని ఉండరు. అందుకోసమే మన బ్రిడ్జిలు, డ్యాములు, రిజర్వాయర్లు, రోడ్లు కట్టిన కొన్ని నాళ్ళకే చెడిపోవడమో పడిపోవడము జరిగిపోతుంది.
అత్యధిక జనాభా కలిగిన దేశం మనది. ఉన్న జనాభాలో వ్యక్తుల యొక్క సామర్ధ్యాలు పెంచడం లేదు. అయినా ఇంకా కేవలం మతవైశ్యమ్యాలతో జనాభాను పెంచమనడం ఘోరం. అసలు తిండికి బట్టకే లేనప్పుడు ఇంకా దేశ సంస్కృతి గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితులలో ఎలా ఉంటారు.
మనంత జనాభా ఉన్న చైనాలో ప్రతి ఒక్క చైనీయుడు భారతీయుని కన్నా ఐదు అంతలు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాడు. అక్కడ ఇండ్లు లేని ఒక కుటుంబం కూడా ఉండదు. వారి కన్నా మన దగ్గర ప్రకృతి వనరులు ఎక్కువ. అయినా మన వెనుకబడి ఉండేందుకు ఎవరు కారణం. ఇంకెవరు నాయకులే. ఆ నాయకులకు సలహాలు ఇచ్చే అటువంటి మత, ఐడియాలజీ పరమైనటువంటి మేధావులు.
ఈరోజు దేశంలో చాలామంది నిజాయితీ గల మేధావులు చివరికి సుప్రీంకోర్టు కూడా యువతి యువకులు సహజీయనం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఈరోజు యువతకు ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు ఎప్పుడూ ఊడుతాయో తెలియదు. ఆ ఉద్యోగాల్లో జీతాలు తక్కువ. మొత్తం కార్మిక జనాభాలో సంక్షేమ పథకాల అర్హులైన వారు 10 శాతం కూడా లేరు. ఇటువంటి పరిస్థితులలో యువతి యువకులు పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని విద్యా వైద్య చివరికి ఆహార ఖర్చులు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితులలో జీవితాన్ని దుర్భరం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువకుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అసలు ఈ రోజు చాలామంది దేశం గురించి నిజమైన అవగాహన ఉన్నవాళ్లు యువతీ యువకుల్ని అసలు వివాహాలే చేసుకోవద్దని సహజీవనం చేయాలని, పిల్లలు కనవద్దని చెబుతున్నారు.
భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారే ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాల్సినా, ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు అని నిర్మొహమాటంగా చెప్పాడు. మరి ప్రజల గురించి కాకపోతే ప్రభుత్వాలు ఎవరి గురించా ఆలోచించాలో అర్థం కాదు.
వాషింగ్టన్ కన్సన్సెస్ ఆధారంగా నయా ఉదారవాద విధానాలు ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టిన దగ్గర నుండి దేశంలో అమలవుతున్నాయి. వీటి ద్వారా కొద్దిమంది ఆదాయాలు విపరీతంగా పెరిగి పెక్కుమది జీవితాలు విరిగిపోతున్నాయి.
దేశానికి ప్రస్తుతం కావాల్సింది జనాభా నియంత్రణ, యువతలో నైపుణ్యాల అభివృద్ధి, భద్రత కూడిన ఉద్యోగాలు, సుస్థిర ఆర్థిక వ్యవస్థ, వాతావరణ రక్షిత విధానాలు, ఆర్థిక, సాంఘికగా అసమానతల తగ్గింపు, మతసామరస్యము, ప్రాంతీయ సామరస్యము సమానత్వం. ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కువ మందిని కనుమనడం కాళ్లు లేనివాణ్ణి కాశ్మీర్ దాకా దేకమన్నట్టుంది.
డాక్టర్ మండువ హనుమంత్ ప్రసాద్ రావు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box