ఈ-కార్ రేసింగ్ లో పైసా అవినీతి కూడా జరగలేదు - కేటీఆర్

 


ఈ-కార్ రేసింగ్ లో పైసా అవినీతి కూడా జరగలేదు - కేటీఆర్

అవినీతే జరగలేదు - కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు 

ఓఆర్ఆర్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి 

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊరట లభించింది. 10 రోజుల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏసీబీ విచారణకు సహకరించాలని కేటీఆర్ ను హైకోర్టు ఆదేశించింది.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 


ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో తనపై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల బిఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తప్పుపట్టారు. అసలు అవినీతేజరగలేదని అవినీతి నిరోదక శాఖ కేసెట్లా పెడుతుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వైఫల్యాలు ప్రశ్నించినందుకే తప్పుడుకేసులుపెడుతున్నారని  అన్నారు.

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లోకేటీఆర్ ను ఏ1గా పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో కేటీఆర్ మీడియాతో  చిట్ చాట్ గా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఈ కేసుపై తాను భయపడటం లేదని కేటీఆర్ చెప్పారు. ఇందులో పైసా అవినీతి కూడా జరగలేదని తెలిపారు. లీగల్ గా తాము ముందుకెళతామని అన్నారు. ఈ-కార్ రేసింగ్ పై మంత్రిగా తాను విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే తీసుకున్నానని చెప్పారు. కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదని అన్నారు.


ఈ-కార్ రేసింగ్ లో అవినీతి జరగలేదని, ప్రొసిజర్ సరిగా లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? లేదా ముఖ్యమంత్రే అందరినీ పక్కదోవ పట్టిస్తున్నారా? అని ప్రశ్నించారు. సీఎంకు సమాచార లోపం ఉందని చెప్పారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు