మైమరిపించిన ముద్దుగుమ్మ_మురిపించే అమ్మ

 


*_మైమరిపించిన ముద్దుగుమ్మ_*

*_మురిపించే అమ్మ..!_*


*********************

సహజనటి జయసుధ 

జన్మదినం..17.12.1958


🎂🎂🎂🎂🎂🎂🎂


అభినయానికి..

అందానికి..

ఆహ్లాదానికి..

ఆరిందాతనానికి..

             *జయసుధ*


వినోదానికి..

విరాగానికి..

విషాదానికి..

విలాపానికి..

            *జయసుధ*


నాయిక..

ఏలిక..

అభిసారిక..

విజయగీతిక..

              *జయసుధ*


అమాయకత్వానికి..

అభిమానానికి..

జాణతనానికి..

తరతరానికి..

               *జయసుధ*

        

వెలిగే జ్యోతి..

వెలుగై నిలిచే జీవనజ్యోతి..

అర్థమైన అర్ధాంగి..

అలివేణి కల్యాణి..

            *జయసుధ*


మేఘసందేశం ముగ్ధ..

లేడీ కేడి నంబర్ వన్..

పంచదార బొమ్మ..

బొమ్మరిల్లు అమ్మ..

               *జయసుధ*


అక్కినేని నుంచి

వందనం..అభివందనం..

అనిపించుకుని సారీ కూడా

చెప్పించుకున్న 

నిన్నకు రేపుకు సంధిగ నిలిచిన సుందరి..

నందమూరి నా అన్నవాడు

అడవిరాముడు 

నా తోడన్నాడు..

అవ్వా బువ్వా కావాలంటే

అయ్యేదెలా అబ్బాయీ..

సోగ్గాడిని మురిపించిన మరదలు..

వీణ నాది తీగ నీది

తీగచాటు రాగముంది..

రెబల్ స్టార్ ను 

మెప్పించిన అందం..

మురళీమోహనుడు

పదేపదే అనుమానించినా

పాపం..భరించిన అమరదీపం..

రాజబాబు కోసం ఆకాశం నుండి దిగివచ్చిన 

మిఠాయిపొట్లం..

మొత్తంగా అభినయ రసమయ కాంతిధార..

మంజుల మధుకర సింజాల

సుమధురసింజని

శివరంజని..జనరంజని..

వెండితెర మనోరంజని..

                *జయసుధ*


+++++++++++++++++


*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

       9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు