*హాస్టల్ పరిసరాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలి*
*వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
ప్రవైట్ హాస్టల్స్ తప్పని సరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ ప్రవైట్ హాస్టల్స్ యజమానులకు సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా హనుమకొండ డివిజనల్ పోలీసుల ఆధ్వర్యంలో హనుమకొండలోని ప్రైవేట్ హాస్టల్స్ యజమానులతో స్థానిక భీమారంలోని శుభం కళ్యాణ వేదిక లో సిపి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా హాస్టల్ యాజమాన్యం తీసుకోవల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేశారు ఇందులో ప్రధానంగా హాస్టల్ వచ్చి పోయే వారి వివరాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలని, అలాగే హాస్టల్ వుందే వారి దినచర్య పై నజర్ పెట్టాలని. రాత్రి సమయాయాల్లో వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించవద్దని, వీరి కోసం వచ్చే వారి గురించి తగిన సమాచారం తీసుకోవాలని. స్థానిక పోలీసుల సహకారం తీసుకోనే విధంగా యాజమాన్యం ఈనెల 31 తారీకు లో తగు చర్యలు తీసుకోవాలని, జనవరి నుండి హాస్టల్స్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుందని. సూచనలు పాటించని హాస్టల్స్ పైచర్యలు తీసుకోబడుతాయని సిసి తెలిపారు. ఈ కార్యక్రమం ఎ. ఎస్. పి భట్, ఏసీపీ దేవేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు సతీష్, రవి కుమార్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box